భారతీయులకు గుడ్ న్యూస్.. 59 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు..

ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలంటే పాస్ పోర్ట్ కావాల్సిందే. అయితే ప్రపంచంలోనే ఏ దేశ పాస్ పోర్ట్ శక్తివంతమైనదో తెలిసిపోయింది. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్(IATA) అందించిన వివరాల ఆధారంగా హెన్లీ అండ్ పార్ట్ నర్స్ ఇండెక్స్ ఏటా ప్రపంచంలోని శక్తివంతమైన పాస్ పోర్ట్ ల జాబితాను వెల్లడిస్తుంది. తాజాగా ఈ లిస్టును విడుదల చేసింది. ఈ లిస్ట్ ప్రకారం సింగపూర్ పాస్ పోర్ట్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్ పోర్ట్ గా నిలిచింది. సింగపూర్ ఏటా తన నెం. 1 స్థానాన్ని పదిలం చేసుకుంటూ వస్తోంది. సింగపూర్ పాస్ పోర్ట్ కలిగిన వాళ్లు ప్రపంచంలోని 227 దేశాల్లో 193 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణం చేయవచ్చని పేర్కొంది.

ఇక భారత్ తన స్థానాన్ని మెరుగు పరచుకుంది. 2024లో 80వ స్థానంలో ఉండగా ప్రస్తుతం 77వ స్థానానికి చేరుకుంది. ఈ రిపోర్టు ప్రకారం ఇక నుంచి భారతీయులు 59 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. గతంలో ఇది 62 దేశాలుగా ఉన్న విషయం తెలిసిందే. గతేడాది ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, జపాన్‌, సింగపూర్‌, స్పెయిన్‌ సంయుక్తంగా అగ్రస్థానంలో నిలవగా.. ఈసారి సింగపూర్‌ ఒక్క దేశం మాత్రమే తొలి స్థానంలో నిలవడం గమనార్హం.

ఇక రెండో స్థానంలో జపాన్, దక్షిణ కొరియా ఉన్నాయి. జపాన్‌, దక్షిణకొరియాల పాస్‌ పోర్టుతో 190 దేశాల్లో పర్యటించవచ్చు. ఆ తర్వాత డెన్మార్క్‌, ఫిన్లాండ్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, ఐర్లాండ్‌, ఇటలీ, స్పెయిన్‌ దేశాలు మూడో స్థానంలో ఉన్నాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియా, బెల్జియం, లక్సెంబర్గ్, నెదర్లాండ్, నార్వే, పోర్చుగల్, స్వీడన్ దేశాలు శక్తివంతమైన పాస్ పోర్ట్స్ కలిగిన దేశాల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాయి. ఇక న్యూజిలాండ్, గ్రీస్ ఐదోస్థానంలో నిలవగా.. యూకే 6 స్థానంలో అమెరికా 10వ స్థానానికి చేరాయి. యూకే పాస్ పోర్టుపై 186 దేశాలకు అలాగే.. అమెరికా పాస్ పోర్ట్ పై 182 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.

India Jumps to 77th in Henley Passport Index 2025 Unlocks Visa-Free Travel to 59 Countries

ఇక ఈ జాబితాలో అఫ్గానిస్థాన్‌ చివరి స్థానంలో ఉంది. ఇక్కడి పాస్‌ పోర్టుతో కేవలం 25 దేశాల్లో మాత్రమే ప్రయాణించవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ అసోసియేషన్(IATA) అందించిన వివరాల ఆధారంగా హెన్లీ అండ్ పార్ట్ నర్స్ ఇండెక్స్ ఏటా ప్రపంచంలోని శక్తివంతమైన పాస్ పోర్ట్ ల జాబితాను వెల్లడిస్తుంది. ఈ మేరకు తాజా లిస్టును విడుదల చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+