కెనడా విదేశాంగ మంత్రిగా భారత బిడ్డ.. ఎవరామె ? ఏంటా స్టోరీ ?
కెనడాలో జరిగిన ఫెడరల్ ఎన్నికల్లో లిబరల్ పార్టీ మరోసారి ఘన విజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంది. పార్టీ అధినేత మార్క్ కార్నీ మరోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలోనే మంత్రివర్గ పునర్నిర్మాణంలో భాగంగా అనితా ఆనంద్‌ను విదేశాంగ మంత్రిగా నియమించారు. అయితే ఆమె భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఈ అరుదైన ఘనత రెండోసారి కూడా సాధించడం పట్ల ఆమెను అభినందిస్తున్నారు. కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ సహా పలువురు భారతీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశారు. దీంతో అనితా ఆనంద్ గురించి మన వాళ్లంతా తెగ వెతికేస్తున్నారు.
ఎవరు ఈ అనితా ఆనంద్..?
1967 మే 20న నోవాస్కోటియా లోని కెంట్‌విల్లేలో జన్మించారు అనితా ఆనంద్. ఆమె తమిళ, పంజాబీ మూలాల కలిగిన కుటుంబానికి చెందినవారు. తల్లి సరోజ్ దౌలత్‌రామ్ అనస్తీషియాలజిస్ట్ కాగా, తండ్రి సుందరం వివేక్ జనరల్ సర్జన్. ముగ్గురు సోదరీమణుల్లో పెద్దదైన అనితకు గీత, సోనియా అనే ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు.

విద్యాభ్యాసం..
1985లో ఒంటారియోకి వెళ్లిన అనిత.. రాజకీయ శాస్త్రంలో డిగ్రీ సాధించారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో ఆన్‌ర్స్ డిగ్రీ, ఆ తర్వాత డల్హౌసీ, టొరంటో యూనివర్సిటీల నుంచి న్యాయశాస్త్రంలో బాచిలర్స్, మాస్టర్స్ పూర్తిచేశారు. లాయర్‌గా ఎన్నో సంవత్సరాలు పనిచేశారు.
వివాహం..
1995లో జాన్ నోల్టన్ అనే న్యాయవాదిని అనితా ఆనంద్ వివాహం చేసుకున్నారు. వారికి నలుగురు పిల్లలు ఉన్నారు. ప్రస్తుతం ఆమె కుటుంబంతో కలిసి ఓక్‌విల్లేలో నివసిస్తున్నారు.
పొలిటికల్ ఎంట్రీ..
అనితా ఆనంద్ రాజకీయంగా ఇప్పటికే విశేష అనుభవం పొందారు. 2019లో కెనడా ఫెడరల్ క్యాబినెట్‌లో పనిచేసిన మొదటి హిందూ మహిళగా సైతం గుర్తింపు పొందారు. 2019 నుంచి 2021 వరకు పబ్లిక్ సర్వీసెస్, ప్రొక్యూర్‌మెంట్ మినిస్టర్‌గా పనిచేశారు. అంతే కాకుండా ఆమె కెనడా రక్షణ మంత్రిగా ఉన్న సమయంలో ఉక్రెయిన్‌కు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించారు. సాయుధ దళాల్లో లైంగిక వేధింపుల్ని ఆరికట్టి కొత్త సంస్కరణలు తీసుకొచ్చినందుకుగానూ పలు పురస్కారాలు అందుకున్నారు.
Congratulate @AnitaAnandMP on your appointment as Canada’s Minister of Foreign Affairs.
— Dr. S. Jaishankar (@DrSJaishankar) May 14, 2025
🇮🇳 🇨🇦
ఇక ఇప్పుడు విదేశాంగ శాఖ మంత్రిగా నియమితులయ్యారు. అంతకు ముందు ఆ స్థానంలో మెలానీ జోలీ బాధ్యతలు స్వీకరించారు. అలానే అనితా అనంద్ గతంలో రక్షణ మంత్రిగానే కాకుండా పలు కీలక మంత్రిత్వ శాఖలను కూడా నిర్వహించారు.
భగవద్గీతపై ప్రమాణం..
మరోవైపు ప్రమాణ స్వీకారం సందర్భంగా అనితా ఆనంద్ భగవద్గీతపై చేయి ఉంచి ప్రమాణం చేశారు. గతంలో సైతం ఆమె ఇలానే వ్యవహరించి ప్రశంసలు అందుకున్నారు. అంతే కాకుండా ఎక్స్ వేదికగా.. కెనడా విదేశాంగ మంత్రిగా నియమించబడటం గౌరవంగా భావిస్తున్నానని రాసుకొచ్చారు. ప్రధాన మంత్రి మార్క్ కార్నీ నేతృత్వంలో కెనడియన్లకు సురక్షితమైన ప్రపంచాన్ని నిర్మించేందుకు కృషి చేస్తామని రాసుకొచ్చారు.
I am honoured to be named Canada’s Minister of Foreign Affairs. I look forward to working with Prime Minister Mark Carney and our team to build a safer, fairer world and deliver for Canadians. pic.twitter.com/NpPqyah9k3
— Anita Anand (@AnitaAnandMP) May 13, 2025
-
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు!












Click it and Unblock the Notifications