'ట్రంప్ ను చంపేస్తా.. అల్లా హు అక్బర్'.. విమానంలో భారత సంతతి వ్యక్తి హల్ చల్

భారత సంతతికి చెందిన 41 ఏళ్ల వ్యక్తి అభయ్ నాయక్ విమానంలో హల్ చల్ చేశాడు. లండన్ లోని లూటన్ నుంచి గ్లాస్కో బయల్దేరిన ఈజీ జెట్ ఫ్లైట్ విమానంలో అభయ్ నాయక్ ప్రయాణికులను భయాందోళనకు గురిచేశాడు. ట్రంప్ ను చంపేస్తా.. అల్లా హు అక్బర్ అని నినాదాలు చేశాడు. అంతేకాక తన దగ్గర బాంబు ఉందని ఆత్మాహుతి దాడి చేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. ఆయన మాటలకు విమానంలోని పాసింజర్స్ ఆర్తనాదాలు పెట్టారు. దీంతో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. ఆ తర్వాత అభయ్ నాయక్ ను అరెస్ట్ చేశారు పోలీసులు.

అభయ్ నాయక్ అనే భారత సంతతికి చెందిన వ్యక్తి కదులుతున్న విమానంలో ఒక్కసారిగా హల్ చల్ చేశాడు. ఈజీ జెట్ ఫ్లైట్ విమానం లండన్ లోని లూటన్ నుంచి గ్లాస్కో కు బయల్దేరిన నేపథ్యంలో అభయ్ నాయక్.. రాజకీయ నినాదాలతోపాటు తన దగ్గర బాంబ్ ఉందని ఆత్మాహుతి దాడి చేస్తానంటూ గట్టిగా అరవడంతో ప్రయాణికులు భయబ్రాంతులకు లోనయ్యారు. అంతేకాక అమెరికాను అంతం చేస్తా.. ట్రంప్ ను చంపేస్తా.. అంటూ గట్టిగా నినాదాలు చేశాడు. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. అనంతరం అభయ్ నాయక్ ను అరెస్ట్ చేశారు.

Indian-Origin Man Shouts I Will Kill Trump Allahu Akbar on EasyJet Flight Sparks Chaos

విమానం గ్లాస్కోలో ల్యాండింగ్ అయ్యాక అభయ్ నాయక్ ను అరెస్ట్ చేశారు. అతని దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ను పరిశీలించగా భారత సంతతికి చెందిన వ్యక్తిగా తేలింది. అతను వలసదారుడిగా వచ్చినట్లు స్పష్టమైంది. అభయ్ నాయక్ పై పలు సెక్షన్ల మీద కేసు నమోదు చేశారు. అతడ్ని పెయిస్లీ షరీఫ్ కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణలో అతడి దగ్గర ఎలాంటి మారణాయుధాలు, బాంబ్స్ లేనట్లు గుర్తించారు. అభయ్ నాయక్ ను కస్టడీకి తరలించారు అధికారులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+