Donald Trump: డొనాల్డ్ ట్రంప్ కు శుభాకాంక్షలు చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. దీంతో ఆయనకు అన్ని వర్గాల వారు శుభాకాంక్షలు చెబుతున్నారు. భారత ప్రధాన నరేంద్ర మోదీ డొనాల్డ్ ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందిన డొనాల్డ్ ట్రంప్ కు హృదయపూర్వక శుభాకాంక్షలు అని మేదీ ట్వీట్ చేశారు. ట్రంప్ తో కలిసి ఉన్న ఫొటోలను షేర్ చేశారు.
"హృదయపూర్వక అభినందనలు మిత్రమా డొనాల్డ్ ట్రంప్. మీ చారిత్రాత్మక ఎన్నికల విజయం గొప్పది. మీరు మీ మునుపటి పదవీకాల విజయాల ఆధారంగా, భారతదేశం-యుఎస్ సమగ్ర ప్రపంచ, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మా సహకారాన్ని పునరుద్ధరించడానికి నేను ఎదురుచూస్తున్నాను. మన ప్రజల అభివృద్ధి కోసం, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును ప్రోత్సహించడానికి పని చేద్దాం" అని ఎక్స్ లో పోస్ట్ చేశారు.

ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా ట్రంప్ కు శుభాకాంక్షలు తెలిపారు. "మీరు వైట్ హౌస్ లోకి తిరిగిరావడం ఒక కొత్త అధ్యయనానికి నాంది" అని పేర్కొన్నారు ట్రంప్ హయాంలో అమెరికా - ఇజ్రాయెల్ మధ్య సంబంధాలు మరింత బలపడతాయని నెతన్యూహు ఆకాంక్షించారు. విజయం తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రసంగించారు.
అమెరికన్లకు స్వర్ణ యుగం రాబోతోందని ప్రకటించారు. ఘన విజయం అందించిన అమెరికన్లకు ధన్యవాదాలు చెప్పారు.
Heartiest congratulations my friend @realDonaldTrump on your historic election victory. As you build on the successes of your previous term, I look forward to renewing our collaboration to further strengthen the India-US Comprehensive Global and Strategic Partnership. Together,… pic.twitter.com/u5hKPeJ3SY
— Narendra Modi (@narendramodi) November 6, 2024
ఇది అమెరికన్లు సాధించిన గొప్ప విజయంగా అభివర్ణించారు. ఆర్ధికంగా అమెరికా తిరిగి కోలుకునేందుకు ఈ విజయం దోహదం చేస్తోందన్నారు. అధ్యక్షుడిగా ఎన్నిక అయ్యేందుకు కావాల్సిన 270 ఎలక్టోరల్ సీట్ల మ్యాజిక్ ఫిగర్‌ను ట్రంప్ దాటేశాడు. దీంతో ఆయన గెలుపు లాంఛనమైంది. తమకు 315 ఎలక్టోరల్స్ వచ్చే అవకాశం ఉందని ట్రంప్ పేర్కొన్నాడు.












Click it and Unblock the Notifications