అమెరికాలో తెలుగు విద్యార్థి ఉమా సత్యసాయి గద్దె మృతి
Indian student Uma Satya Sai Gadde: అమెరికాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. మరో తెలుగు విద్యార్థి మరణించారు. ఈ మధ్యకాలంలో మృతి చెందిన భారతీయ విద్యార్థుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 10 మంది విద్యార్థులు వేర్వేరు కారణాలతో మరణించారు.
తాజాగా మరణించిన విద్యార్థి పేరు ఉమా సత్యసాయి గద్దె. క్లీవ్‌ల్యాండ్‌లో నివసిస్తోన్నారు. తన నివాసంలో మృతదేహమై కనిపించారు. ఈ విషయాన్ని న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఈ ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు సాగిస్తోన్నారని తెలిపింది.

భారత్‌లో సత్యసాయి కుటుంబానికి సమాచారం ఇచ్చామని పేర్కొంది. మృతదేహాన్ని వీలైనంత త్వరగా భారత్‌కు తరలించడానికి అవసరమైన చర్యలను తీసుకుంటున్నట్లు వివరించింది. ఈ మేరకు తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసింది. మరణానికి గల కారణాలను వెల్లడించలేదు.
ఈ నాలుగు నెలల్లోనే అమెరికా మరణించిన భారతీయ విద్యార్థుల సంఖ్య 10కి చేరడం కలకలం రేపుతోంది. అటు దాడులు సైతం యథేచ్ఛగా చోటు చేసుకుంటూ వస్తోన్నాయి. మార్చిలో భారత్‌కు చెందిన 34 ఏళ్ల శాస్త్రీయ నృత్య కళాకారుడు అమర్‌నాథ్ ఘోష్‌ను మిస్సోరిలోని సెయింట్ లూయిస్‌లో కాల్చి చంపిన విషయం తెలిసిందే.
బోస్టన్ యూనివర్శిటీలో చదువుకునే గుంటూరుకు చెందిన విద్యార్థి పరుచూరి అభిజిత్.. మృతదేహాన్ని ఓ కారులో పోలీసులు గుర్తించారు. క్లీవ్‌ల్యాండ్‌లోనే నివసించే భారత్‌కే చెందిన మహ్మద్ అబ్దుల్ అరాఫత్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. హైదరాబాద్‌కు చెందిన సయ్యద్ మజర్ అలీ అనే విద్యార్థిపై చికాగోలో దుండగులు దాడి చేశారు. అప్పట్లో ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Deeply saddened by the unfortunate demise of Mr. Uma Satya Sai Gadde, an Indian student in Cleveland, Ohio.
— India in New York (@IndiainNewYork) April 5, 2024
Police investigation is underway. @IndiainNewYork continues to remain in touch with the family in India.
All possible assistance is being extended including to transport…
పర్డూ యూనివర్సిటీలో 23 ఏళ్ల విద్యార్థి సమీర్ కామత్.. ఫిబ్రవరి 5వ తేదీన ఇండియానాలో మృతదేహమై కనిపించాడు. పర్డ్యూ యూనివర్శిటీ విద్యార్థి నీల్ ఆచార్య అనుమానాస్పద మృతి, జార్జియాలో వివేక్ సైనీ దారుణ హత్యోదంతం, ఐటీ నిపుణుడు వివేక్ తనేజాపై వాషింగ్టన్‌లోని ఓ రెస్టారెంట్ సమీపంలో ప్రాణాంతక దాడి.. ఇవన్నీ అమెరికాలో నివసించే భారతీయులను ఉలిక్కిపడేలా చేస్తోన్నాయి.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications