Tejas Jet Crash: దుబాయ్ ఎయిర్ షోలో అపశృతి..! తేజస్ జెట్ క్రాష్..!
దుబాయ్ లో ఇవాళ జరుగుతున్న ఎయిర్ షోలో అపశృతి చోటు చేసుకుంది. ఎయిర్ షోలో జరుగుతున్న విన్యాసాల్లో పాల్గొంటున్న మన యుద్ధ విమానం తేజస్ జెట్ అనూహ్యంగా కుప్పకూలింది. రష్యాతో కలిసి భారత్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ కు అంతర్జాతీయంగా మంచి పేరుంది. అలాంటిది ఇవాళ తేజస్ జెట్ కుప్పకూలడం చర్చనీయాంశంగా మారుతోంది. ఈ ప్రమాదంలో పైలట్ బతికున్నారా లేదా అన్నది తేలాల్సి ఉంది.
ఇవాళ మధ్యాహ్నం దుబాయ్ ఎయిర్ షోలో ప్రదర్శన జరుగుతుండగా భారతదేశానికి చెందిన తేజస్ ఫైటర్ జెట్ కూలిపోయిందని వార్తా సంస్థ ఏపీ నివేదించింది. స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 2:10 గంటల ప్రాంతంలో ఈ కార్యక్రమంలో ప్రేక్షకుల కోసం ప్రదర్శన ఇస్తుండగా విమానం కూలిపోయినట్లు తెలిపింది.

తేజస్ విమాన ప్రమాదం జరిగిన తర్వాత విమానాశ్రయం మీదుగా నల్లటి పొగలు కమ్ముకున్నాయి. మహిళలు, పిల్లలు సహా అక్కడికి వచ్చిన వారంతా ఈ ఘటనతో ఒక్కసారిగా షాకయ్యారు. తేజస్ విమానం నేలను ఢీకొనే ముందు పైలట్ బయటకు దూకాడా లేదా అనేది ఇంకా తెలియడం లేదు. ఈ ఘటనను భారత వైమానిక దళం నిర్ధారించింది. అయితే ఎయిర్ ఫోర్స్ అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది.
దుబాయ్ ఎయర్షోలో ఫైటర్ జెట్ ప్రమాదం#Dubai #FighterJet #Jet #ViralWatch #Oneindia #OITelugu
— oneindiatelugu (@oneindiatelugu) November 21, 2025
దుబాయ్ ఎయర్షో ప్రదర్శన సమయంలో ఫైటర్ జెట్ ఆకస్మికంగా కూలిపోయింది
గాల్లో స్టంట్ చేస్తూ ఉన్న సమయంలో నియంత్రణ కోల్పోయినట్లు సమాచారం pic.twitter.com/ypXA7mQRSN
దుబాయ్ లోని రెండవ విమానాశ్రయం రెండేళ్లకు ఒకసారి జరిగే దుబాయ్ ఎయిర్ షోను నిర్వహిస్తోంది. ఈ సంవత్సరం ఎమిరేట్స్ , దాని తక్కువ ఖర్చుతో కూడిన సోదర విమానయాన సంస్థ ఫ్లై దుబాయ్ నుండి ప్రధాన విమాన ఆర్డర్‌లతో గుర్తించబడిన కార్యక్రమం ఇది. ఈ ప్రమాదానికి కారణం ఏంటో ఇంకా తెలియలేదు. అలాగే అందులో పాల్గొన్న వారి పరిస్థితిపై వివరాలు కూడా తెలియాల్సి ఉంది.












Click it and Unblock the Notifications