అగ్ని-5 మిసైల్ సిద్ధం.. అమెరికా, చైనా బంకర్ బస్టర్ బాంబులను మించిన శక్తి.. ప్రపంచంలో ఎక్కడా లేని ఆయుధం..!
భారత్ కు సరిహద్దు దేశాలైన పాకిస్థాన్, చైనాలతో ఎప్పుడూ ఉద్రిక్తతలు, సరిహద్దు వివాదాల నేపథ్యంలో రక్షణ రంగంపై భారీగా ఖర్చు చేస్తోంది కేంద్ర రక్షణ శాఖ. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలను సమకూర్చుకుంటోంది. అటు పాకిస్థాన్ తో ఉద్రిక్తతల దృష్ట్యా భారత్ రక్షణ రంగంపై కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. అత్యాధునిక, శక్తివంతమైన ఆయుధాలను భారత అమ్మల పొదిలోకి చేర్చుతోంది.
తాజాగా అగ్ని- 5 మిసైల్ ను సిద్ధం చేస్తోంది భారత్. భవిష్యత్తులో ఎలాంటి యుద్ధాలు జరిగినా సిద్దమయేందుకు భారత్ లోని డీఆర్డీఓ ఈ క్షిపణిని సిద్ధం చేస్తోంది. వీటికి బంకర్ బస్టర్ బాంబులుగా పేరుంది. వీటి తయారీని భారత్ వేగవంతం చేసింది. ఇటీవల ఇరాన్ లోని అణు కేంద్రాలను ధ్వంసం చేసేందుకు బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది అమెరికా. ఈ బాంబులు భూమి లోపలికి 60 మీటర్ల వరకు వెళ్లి అణు కేంద్రాలను ధ్వంసం చేశాయి. దీంతో వీటి పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. ఈ క్రమంలోనే అమెరికా బంకర్ బస్టర్ బాంబులకు మించిన శక్తితో భారత్ బంకర్ బస్టర్ బాంబులను తయారు చేస్తోంది.

ప్రతిష్టాత్మక అగ్ని- 5 ఖండాంతర బాలిస్టిక్ మిసైల్ ను డీఆర్ డీఓ అభివృద్ధి చేస్తోంది. బంకర్ బస్టర్ బాంబులను తయారు చేసి అమెరికా, చైనాల సరసన నిలవాలని భారత్ ఉవ్విళ్లూరుతోంది. అగ్ని-5 మిసైల్ కు అమెరికాకు చెందిన బంకర్ బస్టర్ బాంబుల కంటే అధిక శక్తి ఉంది. ఈ క్షిపణి నేల లోపలికి 100 మీటర్లు చొచ్చుకెళ్లి విధ్వంసం సృష్టిస్తాయి. ఈ మిసైల్ 7,500 కిలోల ఆయుధ సామాగ్రిని మోసుకెళ్లగలదు. ఈ మేరకు అగ్ని-5లో రెండు కొత్త రకాలను అభివృద్ధి చేస్తోంది డీఆర్ డీఓ. వీటిలో ఒకటి భూమిపై ఉన్న టార్గెట్ కోసం, మరొకటి భూగర్భంలోని లక్ష్యాలను ఛేదించే విధంగా రూపొందిస్తోంది.
🇮🇳 India is developing an Agni-5–based hypersonic bunker-buster missile
— Kiran bhoir (@Kiran_Bhoir1979) July 1, 2025
🧨 7,500–8,000 kg
🛡️ Penetrates 80–100m underground
🚀 2,500 km range at hypersonic speed
A game-changer in precision conventional strike capability!#Agni5 #IndiaDefense #HypersonicMissile #BunkerBuster pic.twitter.com/1YkrYXlywA
జూన్ 22న ఇరాన్ లోని ఫోర్డో , నటాంజ్ అణు స్థావరాలపై అమెరికా జరిపిన దాడుల్లో ఈ బంకర్ బస్టర్ బాంబులను ప్రయోగించింది. దీంతో వీటి గురించి ప్రపంచానికి తెలిసింది. అమెరికాలో వీటిని GBU-57 మ్యాసివ్ ఆర్డినాన్స్ పెనెట్రేటర్ గా పిలుస్తారు. చైనాలో ఈ బంకర్ బస్టర్ బాంబులను DF-15B మిసైల్స్ గా అభివర్ణిస్తారు. ఇక ప్రస్తుతం భారత్ అభివృద్ధి చేస్తున్న అగ్ని- 5 మిసైల్ ఈ రెండింటి కన్నా శక్తివంతమైనది కావడం విశేషం.
-
ముంబాయి ఇండియన్స్ కెప్టెన్సీ నుంచి హార్డిక్ ఔట్, కొత్త కెప్టెన్ ఫిక్స్..!? -
ప్రపంచంలోనే అత్యంత 'చెత్త' దేశంగా పాకిస్థాన్ రికార్డు.. -
92 వేల టన్నుల LPGతో భారత్ కు రెండు నౌకలు.. హర్మూజ్ జలసంధి గుండా.. -
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్టాప్లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్












Click it and Unblock the Notifications