భారత ఆర్థిక మూలాలపై దెబ్బకొడుతున్న ట్రంప్?

India US Trade Deal: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించిన కొత్త టారిఫ్‌లు దేశ వాణిజ్యం రంగంపై గణనీయమైన ప్రభావాన్ని చూపనున్నాయి. ప్రత్యేకించి కాపర్, ఫార్మాసూటికల్స్ ఎగుమతులపై ఈ టారిఫ్‌ భారత్‌ కు పెను సవాలుగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

కాపర్ ఎగుమతులపై 50 శాతం టారిఫ్..

ఉక్కు, అల్యూమినియంపై విధించిన టారిఫ్ తర్వాత ఇప్పుడు కాపర్ పై 50 శాతం టారిఫ్ విధించారు డొనాల్డ్ ట్రంప్. 2024-25 ఆర్థిక సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా రెండు బిలియన్ డాలర్ల విలువైన కాపర్, దాని ఆధారిత ఉత్పత్తులను ఎగుమతి చేసింది భారత్. ఇది రికార్డు.

India s these sectors braces to his as Trump s Tariff

ఈ ఎగుమతుల్లో అమెరికా వాటా 360 మిలియన్ డాలర్ల పైమాటే. అంటే మొత్తం రాగి ఎగుమతుల్లో ఇది 17 శాతం. అమెరికా భారత్ కు మూడవ అతిపెద్ద కాపర్ ఎగుమతి మార్కెట్. కాపర్ ఎగుమతుల్లో సౌదీ అరేబియా- 26, చైనా- 18 శాతం అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

మౌలిక సదుపాయాలు, ఇంధనం, తయారీ రంగాల్లో కాపర్ వినియోగం విస్తృతంగా ఉంటోంది. అమెరికాలో డిమాండ్ తగ్గినా కూడా దేశీయ కాపర్ పరిశ్రమపై ఆ ప్రభావం పెద్దగా ఉండకపోవచ్చని, ఈ టారిఫ్ గండం నుంచి భారత్ తేలిగ్గానే బయటపడగలదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఫార్మాపై 200 శాతం వరకు టారిఫ్‌..

దేశ ఫార్మాసూటికల్స్ ఎగుమతులపై విధించబోయే టారిఫ్ 200 శాతానికి పైగా ఉండే అవకాశం ఉందని డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇది ఇప్పటికప్పుడు కాకపోయినా.. వచ్చే ఏడాది కాలంలో దశలవారీగా పెంచుకుంటూ వెళ్తామని అన్నారు. తమకు ఫార్మా ఉత్పత్తులను ఎగుమతి చేసే భాగస్వామ్య దేశాలకు ఏడాది నుంచి ఏడాదిన్నర గడువు ఇస్తామని, ఆ తర్వాత టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్ తేల్చి చెప్పారు.

భారత్ కు అమెరికా అతిపెద్ద విదేశీ మార్కెట్. 2025 ఆర్థిక సంవత్సరంలో అమెరికాకు ఫార్మా ఎగుమతులు 9.8 బిలియన డాలర్లకు పెరిగాయి. ఇది అంతకుముందు సంవత్సరం తో పోల్చుకుంటే 21 శాతం అధికం. గత ఆర్థిక సంవత్సరంలో 8.1 బిలియన్ డాలర్ల మేర ఫార్మా ఎగుమతులు నమోదయ్యాయి.

దేశ మొత్తం ఫార్మా ఎగుమతుల్లో అమెరికా వాటా 40 శాతం ఉందంటే.. ఈ రంగంలో భారత్ కు ఆ దేశం ఎంత పెద్ద మార్కెట్ అనేది అర్థం చేసుకోవచ్చు. ఈ పరిస్థితుల్లో ఫార్మా, దాని అనుబంధ ఉత్పత్తులపై 200 శాతం టారిఫ్ విధిస్తే- అది దేశ ఫార్మా రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు లేకపోలేదు.

ప్రత్యేకించి- జెనరిక్ ఫార్మా ఇండస్ట్రీ కుదుపులకు లోనయ్యే అవకాశం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. జెనరిక్ మెడిసిన్.. అమెరికా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థకు చవక ధరలకు మందులను అందించడంలో కీలక పాత్ర పోషిస్తోది. ఈ టారిఫ్ అమెరికా వినియోగదారులపై కూడా భారాన్ని మోపవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+