Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

indigo: యుద్ధం ఎఫెక్ట్: ఒకే విమానంలో 149 పైలట్లు..!

మిడిల్ ఈస్ట్ ప్రాంతంలోని దేశాలు అట్టుడుకిపోతున్నాయి. ఇరాన్ పై ఇజ్రాయెల్- అమెరికా దాడులు కొనసాగిస్తోంది. శనివారం ప్రారంభమైన దాడులు క్రమంగా ఉద్ధృతం అవుతున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్- అమెరికా సంయుక్తంగా జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మృతి చెందిన విషయం తెలిసిందే. దాంతో ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. ఇజ్రాయెల్ తోపాటు గల్ఫ్ దేశాలపై దాడులకు పాల్పడుతోంది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియా, సైప్రస్, ఇరాక్‌, జోర్డాన్‌ తదితర దేశాలపై క్షిపణులు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది.

అయితే యుద్ధం కారణంగా రద్దు అయిన విమాన సర్వీసులు ఇప్పుడిప్పుడే ప్రారంభం అవుతున్నాయి. దుబాయ్ లో పాక్షికంగా తిరిగి ప్రారంభమయ్యాయి. తాజాగా దుబాయ్ నుంచి వచ్చిన ఎమిరేట్స్ విమానం ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగింది. గత కొన్ని రోజులుగా విమానాల రద్దు, జాప్యాల కారణంగా దుబాయ్ లో చిక్కుకుపోయిన ప్రయాణీకులను ఈ విమానం ద్వారా తీసుకొచ్చారు.

IndiGo and Air India Bring Back 149 Stranded Pilots amp amp Crew from Dubai Repatriation Underway

ఇండియన్ ఎయిర్ లైన్స్ ప్రస్తుతం దుబాయ్ నుంచి ఓ స్పెషల్ ఫ్లైట్ ను ఆపరేటింగ్ చేస్తోంది. దుబాయ్ లో విమానాలు రద్దు అయిన తర్వాత తొలిసారిగా అక్కడి నుంచి భారత్ బయల్దేరుతున్న విమానం ఇదే.. అయితే ఇందులో ప్రయాణికులు లేరు. ఉన్నవాళ్లంతా పైలట్లే.. యుద్ధం కారణంగా దుబాయ్ లో చిక్కుకుపోయిన మొత్తం 149 పైలట్లు, ఫ్లైట్ అటెండాంట్స్ భారత్ కు పయనమయ్యారు. దుబాయ్, జెడ్డాలో చిక్కుకున్న పైలట్లను ప్రస్తుతం భారత్ కు తరలిస్తోంది ఇండియన్ ఎయిర్ లైన్స్.

ఈ మేరకు ఇండిగో, ఎయిర్ ఇండియా సంస్థలు యుద్ధ ప్రాతిపదికన పైలట్లు, క్రూ సిబ్బందిని స్వదేశానికి తరలిస్తున్నాయి. ఈ వివరాలకు సంబంధించిన పోస్టును ఓ పైలట్ ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ మేరకు ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+