వైరల్ వీడియో: వామ్మో.. విమానం గాల్లో ఉండగానే మంటలు.. జస్ట్ మిస్..
చైనా లో ఓ విమానం గాల్లో ఉండగానే మంటలు చెలరేగాయి. ఓ ప్యాసింజర్ విమానంలోని లగేజీలో బ్యాటరీలో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన విమానంలోని సిబ్బంది, పైలట్.. ఇతర అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో షాంగైలో విమానాన్ని అత్యవసరంగా నిలిపివేశారు. ఆ తర్వాత ఎయిర్ పోర్ట్ లోని వైమానిక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు.
చైనాకు చెందిన ఎయిర్ చైనా ప్యాసింజర్ విమానం CA139 రోజూ మాదిరిగానే అక్టోబర్ 18 శనివారం రోజు కూడా ఈస్ట్రెన్ చైనాలోని హ్యాంగ్ జో నుంచి సౌత్ కొరియా సియోల్ లోని ఇంచియాన్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయల్దేరింది. అయితే విమానంలోని ప్రయాణికుల లగేజీ బ్యాగులో ఉన్న లిథియం బ్యాటరీలో మంటలు చెలరేగాయి. దీంతో ఆ మంటలు తీవ్రతరం అయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది పైలట్.. ఇతర అధికారులకు సమాచారం ఇవ్వగా.. ప్యాసింజర్ విమానాన్ని షాంగైలోని పుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్ చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Air China flight CA139 (B-8583), an Airbus A321-232, was en route at FL330 from Hanghzou to Seoul when a thermal runaway of a lithium battery occurred, leading to a fire in an overhead bin. The flight diverted to Shanghai.pic.twitter.com/rEZdFrC2MZ
— Aviation Safety Network (ASN) (@AviationSafety) October 18, 2025
విమానంలో మంటలు చెలరేగడాన్ని ఓ ప్యాసింజర్ ఫొటో తీశాడు. ఈ ఫోటోను చైనాలో ప్రభుత్వ గుర్తింపు పొందిన న్యూస్ ఛానెల్ జిము న్యూస్ లో ప్రసారం చేశారు. ఈ ఫోటోలో విమానంలో ఓ మూలన మంటలు చెలరేగినట్లుగా ఉంది. విమానంలో పొగ అలుముకున్నట్లు తెలుస్తోంది. ఓ ప్రయాణికుడు మంటలు ఆర్పుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ప్రమాద సమయంలో విమానంలో 169 మంది ప్రయాణికులు అలాగే 7 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.

ఈ ఘటనపై ప్రస్తుతం సమగ్ర స్థాయిలో దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అయితే ప్రయాణికుల భద్రత దృష్ట్యా విమానాన్ని చాలా సేపు షాంగెలోని పుడోంగ్ అంతర్జాతీయ విమానాశ్రాయంలో నిలిపివేసినట్లు అధికారులు పేర్కొన్నారు. మంటలను ఆర్పేశామని ప్రాణాపాయం తప్పిందని అన్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. గతంలోనూ చైనాలో అనేక విమాన ప్రమాదాలు జరిగిన విషయం తెలిసిందే.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications