మీమ్స్ మహారాజు..చీమ్స్ డాగ్ ఇక లేదు: కేన్సర్‌తో పోరాడుతూ: విషాదంలో నెటిజన్స్
వాషింగ్టన్: బాల్ట్జ్ డాగ్.. నెటిజన్లకు చిరపరిచితమైన పేరు. షిబా ఇను రకానికి చెందిన జాగిలం. డోజ్ కాయిన్ లోగో మొదలుకుని వేల కొద్దీ ట్వీట్లకు మీమ్స్‌గా ఓ వెలుగు వెలిగిన ఈ బాల్ట్జ్ డాగ్.. మృతి చెందింది. కొంతకాలంగా కేన్సర్‌తో పోరాడుతోంది ఈ డాగ్. థొరాసెంటిసిస్‌కు ఆపరేషన్ చేసిన కొద్ది సేపటికే మరణించింది. దాని వయస్సు 11 సంవత్సరాలు.
ఆరు నెలలుగా కేన్సర్‌కు ట్రీట్‌మెంట్ తీసుకుంటోంది ఈ డాగ్. చీమ్స్ పేరుతో ఎన్నో మీమ్స్‌కు ఈ డాగ్ ఫేమస్. డోజ్ కాయిన్‌కు కూడా బాల్ట్జ్ డాగ్ ఫొటోనే వినియోగిస్తోన్నారంటే దీనికి ఉన్న విలువ ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. 2013 నుంచీ డోజ్ కాయిన్ ఇదే లోగోను కొనసాగిస్తోంది. బాల్ట్జ్ డాగ్ బ్రీడ్.. షిబా ఇను. హంటింగ్ బ్రీడ్. జపాన్‌కు చెందిన హంటింగ్ బ్రీడ్ జాగిలం ఇది.

నెటిజన్లు, సోషల్ మీడియా యూజర్లు ఏదో ఒక సందర్భంలో ఈ బాల్ట్జ్ డాగ్ మీమ్స్‌ను వినియోగించి ఉంటారనడంలో సందేహాలు అక్కర్లేదు. అది నచ్చడం వల్లే ఎలాన్ మస్క్ కూడా కొద్దిరోజుల కిందట ట్విట్టర్ బ్లూబర్డ్ లోగోకు బదులుగా డోజ్ కాయిన్ బాల్ట్జ్ డాగ్ ఫొటోను వాడారు. 48 గంటల పాటు ఆ లోగో కొనసాగింది అప్పట్లో.
గతంలో కూడా ఇదే బాల్ట్జ్ డాగ్ మీమ్స్‌ను ఎలాన్ మస్క్ వినియోగించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 15వ తేదీన ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కుర్చీలో దీన్ని కూర్చోబెట్టారు. కొత్త సీఈఓ వచ్చాడంటూ అప్పట్లో ప్రచారం చేశారాయన. అలాంటి ఫేమస్ డోజ్ కాయిన్ డాగ్.. ఇప్పుడు లేకపోవడం వల్ల నెటిజన్లు విషాదాన్ని వ్యక్తం చేస్తోన్నారు.

దీనికి ఎవరూ బాధపడొద్దని, బాల్ట్జ్ ఇచ్చిన స్మృతులు వేలల్లో ఉన్నాయంటూ ఓదార్పు చెప్పుకొంటోన్నారు నెటిజన్లు. బాల్ట్జ్ ఇక లేదంటూ దాని యజమాని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే లక్షలాది మంది నెటిజన్లు షాక్‌కు గురయ్యారు. రిప్ సందేశాలను పోస్ట్ చేశారు.
ఆ పోస్ట్‌కి కొన్ని గంటల వ్యవధిలో ఆరు లక్షలకు పైగా లైక్స్ పడ్డాయి. 20 వేలమంది కామెంట్స్ పోస్ట్ చేశారు. చీమ్స్‌కు నివాళి అర్పించారు.












Click it and Unblock the Notifications