హాలీవుడ్ హాట్ హీరోయిన్ ను అనుకరించబోయి.. కటకటాల పాలైన ఇన్ స్టాగ్రామ్ స్టార్
టెహ్రాన్: ఈ ఫొటోలో కనిపిస్తోన్న అమ్మాయి పేరు సహర్ తబర్. ఇరానియన్. ఇన్ స్టాగ్రామ్ స్టార్ గా గుర్తింపు పొందారు. సోషల్ మీడియాలో మరింత పేరు తెచ్చుకోవాలనే ఆతృత ఆమెను కటకటాల పాలు చేసింది. దేవుడిని అవమానించదనే కేసు ఆమె మీద నమోదైంది. హాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఏంజెలీనా జోలి గురించి తెలియని వారు ఉండకపోవచ్చు. ఆమె తరహాలో తనను తాను మార్చుకోవడానికి ప్రయత్నించారు సహర్. దీనికోసం 50 సార్లకు పైగా కాస్మటిక్ సర్జరీ చేసుకున్నారు. ఏంజెలీనా జోలి లాగా కనిపిస్తే ఫర్లేదు గానీ.. ఆమెను జోంబీ క్యారెక్టర్ లో చూపించే ప్రయత్నం చేశారు.
ఏంజెలీనా జోలీ జోంబీ క్యారెక్టర్ లో కనిపిస్తే ఎలా ఉంటారనే ఊహకు రూపాన్ని ఇవ్వడానికి సహర్.. తన రూపాన్ని మార్చుకున్నారు. ఇలా తయారయ్యారు. ఏంజెలీనా జోలిని ఉద్దేశపూరకంగా కించపరిచారనే ఆరోపణలు ఆమెపై వెల్లువెత్తాయి. ఓ హాలీవుడ్ నటిని అనుకరించబోయి సాంస్కృతిక నేరానికి పాల్పడినట్లు విమర్శలు ఇరాన్ లో సంచలనంగా మారాయి. మతపరమైన నిబంధనలను పక్కాగా అమలు చేసే ఇస్లామిక్ దేశంగా గుర్తింపు ఉన్న ఇరాన్ ప్రభుత్వం సహర్ ఉదంతాన్ని తీవ్రంగా పరిగణించింది. దైవ దూషణ కింద ఆమెపై కేసు నమోదు చేయాలని స్వయంగా ప్రభుత్వమే ఆదేశించిందంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.

దైవాన్ని దూషించడం, ఉద్దేశపూరకంగా మతపరమైన ఘర్షణలు చెలరేగే ప్రయత్నాలకు పాల్పడటం, వాటి ద్వారా ఆదాయాన్ని పొందాలనుకోవడం.. వంటి అంశాలను పొందుపరుస్తూ సహర్ తబర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు. ఆమెను అరెస్టు చేశారు. నిజానికి- సహర్ తబర్ ఇన్ స్టాగ్రామ్ స్టార్ గా మారడానికి కారణం కాస్మటిక్ సర్జరీలేనని, తనకు నచ్చిన వారిలా రూపురేఖలను మార్చుకోవడం ఆమెకు అలవాటు అంటూ ఇరాన్ మీడియా చెబుతోంది. ఇలాంటి ప్రయత్నాలే ఆమెను చిక్కుల్లోకి నెట్టాయని వ్యాఖ్యానించాయి. దైవ దూషణ కేసు కింద అరెస్టయిన సహర్ తబర్ కు కనీసం పదేళ్ల జైలు శిక్ష తప్పకపోవచ్చని చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications