కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!!

పశ్చిమాసియాలో గత 24 రోజులుగా సాగుతున్న యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఇరాన్ పై దాడులను ఐదు రోజులపాటు నిలిపివేయాలని సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. అలాగే హార్మూజ్ జలసంధిని తెరవాలంటూ ఇరాన్ కు విధించిన 48 గంటల డెడ్ లైన్ ను సైతం ట్రంప్ వాయిదా వేశారు. ఈ మేరకు గత రెండు రోజులుగా ఇరాన్ పై జరుగుతున్న చర్చలు సఫలీకృతం అవుతున్నట్లు పేర్కొన్నారు.

మరోవైపు అమెరికాకు చెందిన F-15 ఫైటర్ జెట్స్ కుప్పకూలుతున్నట్లు స్పష్టం అవుతోంది. ఇటీవల హార్మూజ్ జలసంధిపై ఉన్న F-15 ఫైటర్ జెట్ ను పేల్చేసిన ఇరాన్.. తాజాగా F-15E కు చెందిన ఫైటర్ జెట్ ను కువైట్ ప్రాంతంలో ఇరాన్ కూల్చేసినట్లు ఓ వీడియో సామాజిక మాధ్యమమైన ఎక్స్ లో వైరల్ అవుతోంది. ఈ వీడియో నిడివి 29 సెకన్లపాటు ఉంది.

అయితే ఈ ఘటనపై అమెరికా మిలిటరీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. అయితే మీడియా కథనాల ప్రకారం.. ఫైటర్ జెట్ కుప్పకూలేందుకు ముందే అందులోని పైలట్ సురక్షితంగా బయట పడినట్లు వెల్లడవుతోంది. మరోవైపు ఇటీవల అమెరికాకు చెందిన ఎఫ్-35 ఫైటర్ జెట్ ను సైతం ఇరాన్ ఇటీవల పేల్చేసినట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. దాంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ చేశాడు. తాజాగా అమెరికాకు చెందిన ఎఫ్-15E ఫైటర్ జెట్ ను సైతం ఇరాన్ పేల్చేసిన క్రమంలోనే యుద్ధంపై ట్రంప్ వెనక్కు తగ్గినట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తాకథనాలు వెల్లడవుతున్నాయి.

Iran Claims Second F-15E Shootdown Fact or Propaganda Breaking Updates Iran claims F-15E downing

మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్ కు ఇరాన్ తాజాగా కీలక వార్నింగ్ ఇచ్చింది. ఇరాన్ పై దాడులకు దిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్ రక్షణ మండలి స్పష్టం చేసింది. తమ దేశంపై దాడులను కొనసాగిస్తే పర్షియన్ గల్ఫ్ అంతటా నౌకాదళ మైన్లను మోహరిస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ఇక తాజాగా ట్రంప్ ప్రకటన నేపథ్యంలో పశ్చిమాసియాలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఎదురవుతాయోనని ఆందోళన నెలకొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+