Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కనీవిని ఎరగని ఊచకోత: రెండు రోజుల్లోనే 36,000 మంది బలి!

ఇరాన్ నిరసనకారులపై ఆ దేశ ప్రభుత్వం సాగిస్తున్న అణచివేత పరాకాష్టకు చేరింది. ద్రవ్యోల్బణం, రాజకీయ అణచివేత, పౌర హక్కుల కోసం జనవరి ప్రారంభం నుంచి సాగుతున్న నిరసనల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయినట్లు దిగ్భ్రాంతికరమైన గణాంకాలు వెలుగులోకి వచ్చాయి.

రెండు రోజుల్లోనే మారణహోమం

విపక్షాల మద్దతు ఉన్న 'ఇరాన్ ఇంటర్నేషనల్' నివేదిక ప్రకారం.. జనవరి 8, 9 తేదీల్లో భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఏకంగా 36,000 మందికి పైగా మరణించినట్లు సమాచారం. క్షేత్రస్థాయి నివేదికలు, వైద్య సిబ్బంది, ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా ఈ అంకెలను వెల్లడించారు. ఆధునిక చరిత్రలో ఇది అతిపెద్ద పౌర ఊచకోతగా అభివర్ణించబడుతోంది.

iran protests 36 000 Killed in Two Days Supreme Leader Khamenei Reportedly Moves to Bunker

ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(IRGC)పై తీవ్ర ఆరోపణలు

ఈ దారుణ కాండ వెనుక ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC), 'బసీజ్ మిలీషియా' దళాలు ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. నిరసనలను అణచివేయడానికి ఇరాన్ ప్రభుత్వం ఇరాక్, సిరియా నుండి కిరాయి దళాలను కూడా రప్పించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వివిధ నివేదికల ప్రకారం మృతుల సంఖ్య 27,500 నుంచి 36,500 మధ్య ఉండవచ్చని అంచనా.

అజ్ఞాతంలోకి సుప్రీం లీడర్ ఖమేనీ?

దేశంలో పరిస్థితులు చేయి దాటిపోవడంతో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ భద్రత దృష్ట్యా టెహ్రాన్‌లోని ఒక రహస్య భూగర్భ ప్రాంతానికి మారినట్లు సమాచారం. అంతర్గత తిరుగుబాటు, విదేశీ దాడుల భయంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అంతర్జాతీయ స్పందన

ఇరాన్ భద్రతా దళాల హింసాత్మక చర్యలను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి తీవ్రంగా ఖండించింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్, లుఫ్తాన్సా వంటి ప్రముఖ విమానయాన సంస్థలు ఇరాన్, పరిసర ప్రాంతాలకు విమాన సర్వీసులను రద్దు చేశాయి. భారత్ నుంచి ఎయిర్ ఇండియా, ఇండిగో కూడా తమ రూట్లను మార్చుకున్నాయి. ఇరాన్ ప్రభుత్వం ఈ గణాంకాలను అధికారికంగా ధ్రువీకరించలేదు, కానీ అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు అక్కడి పరిస్థితులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+