భారత్ కు బిగ్ షాక్- హార్ముజ్ జలసంధి పూర్తిగా మూసివేయనున్న ఇరాన్
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి ఇప్పుడు కీలకంగా మారింది. అమెరికా, ఇరాన్ మధ్య హార్ముజ్ జలసంధిపై ఉద్రిక్తతలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. ఇరు దేశాలు పరస్పరం బెదిరింపులకు దిగుతున్నాయి. జలసంధిని 48 గంటల్లోపు పూర్తిగా తెరవకపోతే విద్యుత్ కేంద్రాలపై సైనిక చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన తర్వాత అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.
స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్‌ను పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ తాజాగా హెచ్చరించింది. తమ దేశంలో ఏ ఒక్క విద్యుత్ ప్లాంట్ పై అయినా అమెరికా దాడి జరిగిన మరుక్షణమే హార్ముజ్ జలసంధి పూర్తిగా మూతపడుతుందని తేల్చి చెప్పింది. ఈ విషయంలో తాము వెనడుగు వేయబోమని, ట్రంప్ బెదిరింపులక లొంగే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. దీనివల్ల భారత్ సహా ఇతర మిత్రదేశాలకు అరకొరగా సాగుతున్న ఇంధన రవాణా సైతం పూర్తిగా స్తంభించిపోతుంది.

విద్యుత్ ప్లాంట్లపై బాంబు దాడి చేస్తామన్న బెదిరింపును ట్రంప్ అమలు చేసిన అనంతరం జరిగే పరిణామాలకు అమెరికా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొంది ఇరాన్. దానిని నిరవధికంగా మూసివేయడంతో పాటు అమెరికా/ఇజ్రాయెల్ కు సహకరిస్తోన్న ఇతర గల్ఫ్ దేశాల మౌలిక సదుపాయాలపై దాడి చేస్తామని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. ఈ జలమార్గంపై తనకు ఉన్న పట్టును ఆర్థికంగా ఉపయోగించుకునేందుకు ఇరాన్ చర్యలు తీసుకుంటోంది.
అమెరికా స్థావరాలకు ఆతిథ్యమిస్తున్న దేశాల్లోని ఇంధన కేంద్రాలను తాము లక్ష్యంగా చేసుకుంటామని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) ప్రకటించింది. తమ దేశ మౌలిక సదుపాయాలపై అమెరికా గానీ, దానికి సహకరిస్తోన్న ఇతర దేశాలు గానీ దాడులకు పాల్పడితే ప్రాంతీయ సౌకర్యాలను కోలుకోలేని విధంగా నాశనం చేస్తామని అటు ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ బాక్వెర్ ఖాలిబాఫ్ సైతం హెచ్చరించారు.
-
కుప్పకూలిన ఖతర్ హెలికాప్టర్.. !! -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
డొనాల్డ్ ట్రంప్ సడన్ యూటర్న్- యుద్ధ విరామం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్ -
యుద్ధ భారం వాహనదారులు మోయక తప్పదా? -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications