'రేపు రాత్రికి ఇరాన్ ఉండదు '.. ట్రంప్ సంచలన ప్రకటన

పశ్చిమాసియాలో యద్ధం కొనసాగుతూనే ఉంది. తాజాగా అమెరికాకు ఇరాన్ బిగ్ షాక్ ఇచ్చింది. అమెరికా ప్రతిపాదించిన సీజ్ ఫైర్ ఒప్పందాన్ని ఇరాన్ తిరస్కరించింది. తాత్కాలిక కాల్పుల విరమణకు ఇరాన్ సిద్ధంగా లేదని స్పష్టం చేసింది. అయితే యుద్ధం శాశ్వతంగా ముగించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ఈ మేరకు 10 ప్రతిపాదనలను అమెరికా ముందు ఉంచింది ఇరాన్. అయితే తాజాగా ఇరాన్ నిర్ణయంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇరాన్ చర్యలకు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చారు.

ఈ మేరకు తాజాగా ఓవల్ ఆఫీస్ లో ట్రంప్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హార్మూజ్ జలసంధిపై తాను ఇచ్చిన డెడ్ లైన్ కు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. మంగళవారం రాత్రి 8 గంటల వరకే ఇరాన్ కు డెడ్ లైన్ విధించినట్లు.. అందులో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ ప్రతిపాదించిన 10 గైడ్ లైన్స్ తో ఇరాన్ ఓ నిర్ణయం తీసుకుందని కానీ అంత ఆశాజనకంగా లేదని తేల్చారు. ఇరాన్ మొత్తాన్ని ఒక్క రాత్రిలోనే తూడ్చిపెట్టేస్తామని సంచలన వార్నింగ్ ఇచ్చారు. అది రేపు(ఏప్రిల్7 మంగళవారం) రాత్రి కావొచ్చు అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇరాన్ తన పద్ధతి మార్చుకోకపోతే.. ఆ దేశంలోని చమురు, ఇంధన వనరులను అమెరికా తన స్వాధీనంలోకి తీసుకుంటుందని ట్రంప్ స్పష్టం చేశారు. తద్వారా భారీగా డబ్బు సంపాదించుకోవచ్చని కూడా ట్రంప్ వివరించడం విశేషం. ఈ మేరకు ఒక్క రాత్రిలో ఇరాన్ మొత్తాన్ని తుడిచిపెట్టేయగల సామర్థ్యం అమెరికాకు ఉందని మరోసారి హెచ్చరించారు.

Iran Won t Exist By Tomorrow Night Donald Trump Issues A Sensational Threat To Tehran US-Iran War

అంతకుముందు 2026 వైట్ హౌస్ ఈస్టర్ ఎగ్ రోల్ సందర్భంగా విలేకరులతో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్‌ తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అయితే ఇరాన్ అణ్వాయుధాలు కలిగి ఉండటాన్ని ఎప్పటికీ అనుమతించకూడదని మరోసారి స్పష్టం చేశారు. అమెరికా దగ్గర అనేక ప్రత్యామ్నాయాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ఇప్పటికిప్పుడు వెనక్కు తగ్గే ఆలోచన లేదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+