అత్యవసర మంత్రివర్గ సమావేశం

Iran Israel War: లెబనాన్‌లో హెజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా దారుణ హత్యకు ప్రతీకార దాడులకు దిగింది ఇరాన్. ఇజ్రాయెల్‌పై దండెత్తింది. రెండు గంటల వ్యవధిలో 200 శక్తిమంతమైన బాలిస్టిక్ క్షిపణులను సంధించింది. రాజధాని టెల్ అవివ్ సహా అనేక ప్రాంతాలు ప్రస్తుతం ఇరాన్ టార్గెట్‌లోకి వచ్చాయి.

హెజ్బొల్లాను దాదాపుగా నామరూపాల్లేకుండా చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ ప్రతీకార దాడులకు దిగుతుందనే విషయం ఊహించిందే అయినప్పటికీ- గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇంత భారీ ఎత్తున మిస్సైళ్లతో దాడికి దిగడం అనేది చర్చనీయాంశమైంది. ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది.

Iran s Missile Attack On Israel Iran made a big mistake tonight says PM Benjamin Netanyahu

హసన్ నస్రల్లా హత్యకు ప్రతీకారంగా మొన్నటికి మొన్న ఇజ్రాయెల్‌పై లెబనాన్ యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. జెరూసలెం సహా తమ దేశ భూభాగంపై పలు చోట్ల సైరెన్ మోతలు వినిపించినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తెలిపింది. ఇప్పుడు తాజాగా ఇరాన్ సైతం యుద్ధానికి దిగడం దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.

ఇరాన్ దాడి అనంతరం ఇజ్రాయెల్‌లో పరిణామాలు శరవేగంగా మారిపోయాయి. ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖ పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లారు. ఆయనతో పాటు అందుబాటులో ఉన్న మంత్రులందరూ బంకర్‌ కాంప్లెక్స్‌‌కు వెళ్లారు.

జెరూసలేంలో ఉంటుంది ఈ బంకర్ కాంప్లెక్స్. అక్కడే అత్యవసర మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించారు నెతన్యాహు. ఇజ్రాయెల్ కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ఈ భేటీ ఏర్పాటైంది. యుద్ధం నేపథ్యంలో- బంకర్ కాంప్లెక్స్‌లో ఆ దేశ మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కావడం ఇదే తొలిసారి.

ఇరాన్ మిస్సైళ్ల దాడికి పాల్పడటం పట్ల నెతన్యాహు ఘాటుగా స్పందించారు. దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తమదేశంపై దాడికి పాల్పడటం ద్వారా ఇరాన్ అతి పెద్ద తప్పు చేసిందని వ్యాఖ్యానించారు. దీన్ని సమర్థవంతంగా తిప్పి కొడతామనీ తేల్చి చెప్పారు.

ఇరాన్ చేసిన దాడి విఫలమైందని నెతన్యాహు పేర్కొన్నారు. తమదేశ ఎయిర్ డిఫెన్స్ విభాగం మిస్సైళ్లను విజయవంతంగా అడ్డుకుందని అన్నారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను తమకు ఉందని చెప్పారు. ఇరాన్ అంచనా వేసిన విధంగా తమ దేశంలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+