డొనాల్డ్ ట్రంప్‌పై దాడి ఏడాది ముందే పసిగట్టారా?
Donald Trump: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై చోటు చేసుకున్న కాల్పుల ఉదంతంపై ఆ దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థ ఫెడరల్ బ్యురో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బీఐ) రంగంలోకి దిగింది. ఈ కేసును తాము దర్యాప్తు చేస్తోన్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎఫ్‌బీఐ డైరెక్టర్ క్రిస్టొఫర్ వ్రే ఓ ప్రకటన విడుదల చేశారు.
అమెరికాలో ఈ ఏడాది చివర్లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. రిపబ్లిక్ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ వరుసగా మూడోసారి ఈ ఎన్నికల్లో పోటీలో దిగారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తోన్న సమయంలో ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన కుడి చెవికి బుల్లెట్ తగిలింది. రక్తమోడింది.

డొనాల్డ్ ట్రంప్‌ను హత్య చేయడానికి ప్రయత్నించిన ఆగంతకుడిని థామస్ మాథ్యూ క్రూక్స్ (Thomas Matthew Crooks)గా గుర్తించారు ఎఫ్‌బీఐ అధికారులు. అతని వయస్సు 20 సంవత్సరాలే. పెన్సిల్వేనియా బేథెల్ పార్క్‌లో నివాసం ఉంటోన్నట్లు నిర్ధారించారు.
ట్రంప్ ప్రసంగిస్తోన్న వేదిక నుంచి సుమారు 130 గజాల దూరంలో ఉన్న ఓ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ రూఫ్ టాప్‌పై నుంచి కాల్పులు జరిపాడు. ఆ వెంటనే అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ కౌంటర్- స్నైపర్ టీమ్ ఎదురు కాల్పలు జరిపింది. ఈ కాల్పుల్లో క్రూక్స్ అక్కడికక్కడే మరణించాడు.
డొనాల్డ్ ట్రంప్‌పై ఈ దాడి జరుగుతుందని ముందుగానే ఊహించారు. అమెరికన్ యానిమేటెడ్ సిట్‌కామ్.. ది సింప్సన్స్ దీనికి సంబంధించిన ఓ క్యారికేచర్‌ను చిత్రీకరించింది. మైక్ ముందు డొనాల్డ్ ట్రంప్ ప్రసంగిస్తోన్న ఓ క్యారికేచర్‌ను వేసింది. దానికి సీక్వెన్స్‌గా ఆయన భౌతికకాయాన్ని కెఫిన్‌లో ఉంచినట్లు మరో కార్టూన్ గీసింది.
the simpsons underestimated trump so hard pic.twitter.com/Aej1TBR8gg
— barney (@barneyxbt) July 13, 2024
ఆ తరువాత ఈ రెండంటినీ డొనాల్డ్ ట్రంప్ నోరెళ్లబెట్టి చూస్తున్నట్లుగా మరో కార్టూన్ వేసి.. దీనికి ముక్తాయింపు ఇచ్చింది. ఈ కార్టూన్లు, క్యారికేచర్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. యానిమేటెడ్ సిట్‌కామ్ ఈ సంఘటనను ఎలా ఊహించిందనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.












Click it and Unblock the Notifications