ఐసిస్ భయంకర వీడియో: తుపాకీ తీసి కాల్చిన చైల్డ్ ఐసిస్ ఉగ్రవాది
సిరియా: దడ పుట్టిస్తున్న ఐసిస్ తీవ్రవాదులు మంగళవారం ఓ వీడియో విడుదల చేశారు. వయస్సులో చిన్నవాడైన ఓ ఐసిస్ ఉగ్రవాది ఓ వ్యక్తిని చంపుతున్న వీడియో కలకలం రేపుతోంది. ఆ చిన్న ఐసిస్ ఉగ్రవాది చంపింది ఇజ్రాయెల్ గూఢచారిగా ఐసిస్ చెబుతోంది.
చిన్న పిల్లాడైన ఐసిస్ ఉగ్రవాది చేతిలో బలైన వ్యక్తి పందొమ్మిదేళ్ల మొహమ్మద్ సయిద్ ఇస్లామి ముసల్లంగా గుర్తించారని తెలుస్తోంది. అతను ఇజ్రాయెల్‌కు చెందిన వ్యక్తి. అరబ్ సంతతికి చెందినవాడని చెబుతున్నారు.
తన వీడియోలో ఐసిస్.. ముసల్లం ఇజ్రాయెల్ ఏజెంట్ అని, మిలిటెంట్ గ్రూప్‌లలోకి చొరబడ్డాడని ఆరోపించింది. అయితే, వధించబడిన వ్యక్తి కుటుంబ సభ్యులు మాత్రం ఐసిస్ ఆరోపలను కొట్టి పారేశారు. అతను ఇజ్రాయెల్ గూఢచారి కాదన్నారు. ఇజ్రాయెల్ అధికారులు స్పందించాల్సి ఉంది.

ఈ వీడియోను మంగళవారం పోస్ట్ చేసారు. దీనిని ఐసిస్‌కు చెందిన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వీడియోలో.. వధించబడిన ముసల్లమ్ మోకాళ్ల పైన కూర్చున్నాడు. అతను ఆరెంజ్ కలర్ జంప్ సూట్ వేసుకున్నాడు. అతని వెనుకాల ఓ యువకుడైన ఐసిస్ ఉగ్రవాది, ఓ చిన్నవాడైన ఐసిస్ ఉగ్రవాది ఉన్నారు.
పెద్ద వయస్సులో ఉన్న ఐసిస్ ఉగ్రవాది ఫ్రెంచ్‌లో మాట్లాడుతున్నాడు. అతను చిన్ ఐసిస్ ఉగ్రవాదికి ఆదేశాలు ఇచ్చాడు. అతనిని (ముసల్లం) చంపమని చెప్పాడు. వెంటనే చిన్నవాడైన ఐసిస్ ఉగ్రవాది ముందుకు వచ్చి 9ఎంఎం సెమీ ఆటోమేటిగ్ హ్యాండ్ గన్ తీసి అతని నుదుడి పైన కాల్చాడు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications