టవర్ నుండి తోసేసి, మహిళలపై రాళ్లేసి, మగవారిపట్ల..

లండన్: ఇసిస్ తీవ్రవాదులు గేలను టవర్ల నుండి తోసేసి, మహిళల పైన రాళ్లు విసిరి, పురుషుల పట్ల క్రూరంగా ప్రవర్తిస్తున్నారట. కాగా, ఐఎస్‌కు సంబంధించిన సామాజిక అనుసంధాన వెబ్ సైట్లలో ఆందోళన కలిగించే ఇమేజెస్ కనిపిస్తున్నాయి.

గత గురువారం ఇద్దరికి కళ్లకు గంతలు కట్టి వారిని, చాలా పై ఎత్తు నుండి కిందకు తోసేశారు. పలువురు చూస్తుండగానే వారిని తోసేశారట. ఇలాంటి ఫోటోలు ఆందోళన కలిగించేవిగా కనిపిస్తున్నాయి.

మరోవైపు, చార్లీహెబ్డో పత్రిక తీరును ఖండిస్తూ పలు దేశాల్లో నిరసనలు, ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. దాడి అనంతరం వెలువడిన సంచిక కవర్‌ పేజీపై ప్రవక్త చిత్రాన్ని ముద్రించిన తీరును పలు ముస్లిం దేశాలు ఖండిస్తున్నాయి.

ISIS throws 'gay' men off tower, stones woman accused of adultery and crucifies 17 young men

నైగర్‌లో ఆందోళనకారులు రెచ్చిపోతున్నారు. ఇనుపరాడ్లు, గొడ్డళ్లతో రాజధాని నియామీ వీధుల్లో దాదాపు వెయ్యి మంది యువకులు రణరంగం సృష్టించారు. ఎనిమిది చర్చిలను ధ్వంసం చేశారు. ఈ నిరసనలు, ఘర్షణల్లో మొత్తం పదిమంది చనిపోయారు.

రష్యాలో ముస్లింలు మెజార్టీగా ఉండే ఇంగస్తీషియా ప్రాంతంలో చార్లీ హెబ్డో పత్రిక తీరును ఖండిస్తూ సుమారు 15 వేల మంది ముస్లింలు నిరసన ర్యాలీ చేపట్టారు. చార్లీహెబ్డోకు వ్యతిరేకంగా కోర్టును ఆశ్రయించాలని ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కోఆపరేషన్‌ (ఓఐసీ) కూడా నిర్ణయించింది.

ఇదిలా ఉండగా.. భావ ప్రకటన స్వేచ్ఛకు తాము కట్టుబడే ఉన్నామని ఫ్రాన్స్‌ పునరుద్ఘాటించింది. అయితే, ఈ విషయంలో పరిమితి ఉండాల్సిందేనని ఫ్రాన్స్‌లోని సగం మంది ఒక సర్వేలో అభిప్రాయపడ్డారు. 42 శాతం మంది ప్రవక్తపై కార్టూన్‌ను వ్యతిరేకించారు. 57 శాతం మంది మాత్రం సమర్థించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+