పాకిస్తాన్ కు ఇస్లామిక్ దేశం సంపూర్ణ మద్దతు- ఈ సారి గన్ షాట్?

ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చి శుక్రవారం కీలక ప్రకటన చేశారు. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ నేపథ్యంలో హోర్ముజ్ జలసంధి వాణిజ్య నౌకల రాకపోకలకు పూర్తిగా తెరిచి ఉంటుందని వెల్లడించారు. ఇజ్రాయెల్, లెబనాన్ మధ్య 10 రోజుల కాల్పుల విరమణ అమలులోకి వచ్చిన రోజే వెలువడింది. దీన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ధృవీకరించారు. ఇరాన్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఒప్పందం కుదిరే వరకు కొనసాగుతుందని ఇరాన్ పోర్టులపై విధించిన బ్లాకెడ్ కొనసాగుతుందని స్పష్టం చేశారు.

దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడిప్పుడే తగ్గముఖం పడుతున్నాయి. అదే సమయంలో అమెరికా- ఇరాన్ మధ్య మలి విడత చర్చలకూ రంగం సిద్ధమైంది. ఈ సారి కూడా పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాదే దీనికి ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ నెల 20వ తేదీన ఈ రెండు దేశాల ముఖ్య ముఖాముఖి చర్చలు జరుగనున్నట్లు సీఎన్ఎన్ తెలిపింది. ఇరాన్ ను ఉటంకిస్తూ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. అమెరికా ఇంకా దీనిని ధృవీకరించలేదు.

Islamabad Set to Facilitate New Round of Iran-US Negotiations Likely On April 20 to De-Escalation

ఇరు దేశాల ప్రతినిధులు ఈ ఆదివారం రాత్రిలోగా ఇస్లామాబాద్ కు చేరుకుంటాయని సీఎన్ఎన్ తెలిపింది. సోమవారం సంప్రదింపులు ప్రారంభించే అవకాశం ఉంది. పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతలను తగ్గించే తాజా దౌత్య ప్రయత్నాల్లో ఇదొకటి. టర్కీలో అంటాల్యా దౌత్య ఫోరమ్ సందర్భంగా ఖతార్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ, టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌తో భేటీ అయ్యారు.

ఉద్రిక్తతలను తగ్గించడం, దౌత్య పరిష్కారాలను ముందుకు తీసుకెళ్లడంపై చర్చలు జరిపారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి పాకిస్తాన్ చేస్తోన్న ప్రయత్నాలను అభినందించారు. ఈ విషయంలో పాకిస్తాన్ కు సంపూర్ణ మద్దతును ప్రకటించినట్లు ఖతార్ అమీరీ దివాన్ వెల్లడించింది. అమెరికా-ఇరాన్ చర్చలను పునరుద్ధరించే ప్రయత్నంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ గురువారం టెహ్రాన్‌లో మొహమ్మద్ బాఘర్ ఘలిబాఫ్‌ను కలిశారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరగ్చీతోనూ భేటీ అయ్యారు.

కాగా, ఈ నెల 11-12 తేదీల్లో ఇస్లామాబాద్ తొలి విడత శాంతి చర్చలు జరిగాయి గానీ అది ఎటువంటి ఫలితాలనూ ఇవ్వలేదు. అర్ధాంతరంగా ముగిశాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన ఈ చర్చలు, ఇరానియన్ విప్లవం తర్వాత రెండు దేశాల మధ్య మొదటి ఉన్నత స్థాయి, ముఖాముఖి సంభాషణలుగా నిలిచాయి. ఇప్పుడు మరో విడత అమెరికా, ఇరాన్ ముఖాముఖి భేటీ కాబోతోండటం, పశ్చిమ ఆసియాలో శాంతిని నెలకొల్పడంలో ఈ చర్చలు అత్యంత కీలకంగా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+