Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

షాకింగ్: ఐఎస్‌లో ఒకరిని చేరిస్తే రూ. 65 లక్షలు!

ఇరాక్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు (ఐఎస్ఐఎస్) జీహాద్ పేరిట యుద్ధం చెయ్యడానికి యువతను ఎలా నియమించుకుంటున్నదనే అసలు విషయం బయటపడింది. మధ్యవర్తులకు భారీ మొత్తంలో నగదు అందిస్తూ కొత్త వారిని ఇస్లామిక్ స్టేట్ లో చేర్చుకుంటున్నది వెలుగు చూసింది.

ఇస్లామిక్ స్టేట్ లో ఒక వ్యక్తిని చేర్చితే 10 వేల డాలర్లు ( సుమారు రూ. 65 లక్షలు) ముట్టచెబుతున్నారని దర్యాప్తులో వెలుగు చూసింది. ఐఎస్ఐఎస్ లో చేరడానికి బెల్జియం నుంచి చాల మంది యువకులు వెళుతున్నారని వెలుగు చూసింది.

వారిని ఇరాక్, సిరియాలో జీహాద్ పేరిట యుద్ధం చెయ్యడానికి ఉపయోగించుకుంటున్నారని ఐరాస గుర్తించింది. ఇటివల అధ్యయనం చెయ్యడానికి ఐరాస ప్రత్యేక బృందం బెల్జియంలో పర్యటించింది. క్షేత్రస్థాయి నుంచి వాస్తవాలు తెలుసుకున్నారు.

బెల్జియంలో నివాసం ఉంటున్న వారి పిల్లలు ఎక్కడెక్కడ ఉంటున్నారు, అదే విదంగా బెల్జియంలో ఉంటున్న యువకుల స్నేహితులు ఎంత మంది విదేశాలలో ఉంటున్నారని ఆరా తీస్తున్నారని వెలుగు చూసింది.

Islamic State (ISIS) Pays Recruiters $10,000 Per Person in Belgium

తరువాత సోషల్ మీడియా ద్వారా వారిని సంప్రదించి ఐఎస్ఐఎస్ లో ఒక వ్యక్తిని చేర్పిస్తే మీకు పెన్షన్ రూపంలో రూ. 65 లక్షలు అందిస్తామని చెబుతున్నారు. చెప్పినట్లే వారికి ఐఎస్ఐఎస్ నగదు అందిస్తున్నదని ఐరాస విచారణలో వెలుగు చూసిందని ఆ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఎల్జ్ బీటా కరస్కా తెలిపారు.

ప్రస్తుతం సిరియా, ఇరాక్ లోని ఇస్లామిక్ స్టేట్ ఫైటర్లలో బెల్జియంకు చెందిన 500 మందికి పైగా యువకులు ఉన్నారని ఆమె స్పష్టం చేశారు. వైద్యులు, కంప్యూటర్ ఇంజనీర్లు, ఇంటర్నెట్ గురించి పూర్తిగా తెలిసిన వారిని చేర్పిస్తే పెద్ద మొత్తంలో నగదు అందిస్తున్నారని ఆమె వివరించారు.

2010లో మొదటి సారి బెల్జియంకు చెందిన షరియా ఫర్ బెల్జియం సంస్థ ఐఎస్ఐఎస్ కోసం నియామకాలు చేపట్టింది. విషయం బయటకు రావడంతో బెల్జియం అధికారులు ఆ సంస్థ నిర్వహకులు అందరిని అరెస్టు చేసి జైలుకు పంపించారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+