పొరుగు దేశాలకు విస్తరించిన ఇజ్రాయెల్- పాలస్తీనా యుద్ధం- భీకర దాడి

టెల్ అవివ్: ఇజ్రాయెల్- పాలస్తీనా మధ్య ఆరంభమైన యుద్ధం రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. మరింత విస్తరిస్తోంది. పొరుగు దేశాలకూ పాకింది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలనపై ఇజ్రాయెల్‌ పెద్ద ఎత్తున విరుచుకుపడుతోంది. రాకెట్లను సంధిస్తోంది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపిస్తోంది.

గత శనివారం ఆరంభమైందీ యుద్ధం. ఈ వారం రోజుల వ్యవధిలో పెద్ద ఎత్తున ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. ఇజ్రాయెల్- హమాస్ పరస్పర దాడుల్లో ఇప్పటికి 5,000 మందికి పైగా మరణించారు. అదే స్థాయిలో వేలాదిమంది గాయపడ్డారు. వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంటోంది. ఫలితంగా మృతుల సంఖ్య పెరుగుతుందనే అంచనాల ఉన్నాయి. లక్షలాదిమంది నిరాశ్రయులయ్యారు.

 Israel- Palestine war: IDF said that it struck several Syrian military targets

తొలుత ఇజ్రాయెల్- పాలస్తీనా సరిహద్దు వెంబడి గాజా సమీప ప్రాంతాల నుంచి హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్లతో దాడులు చేశారు. సరిహద్దులను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంపైకి చొచ్చుకుని వచ్చారు. సరిహద్దులకు ఆనుకుని ఉన్న పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు.

దీనితో ఇజ్రాయెల్ సైన్యం ఎదురుదాడికి దిగింది. ఆపరేషన్ ఐరన్ స్వోర్డ్‌ను ప్రకటించింది. గాజాలోని హమాస్ స్థావరాలను లక్ష్యంగా చేసుకుంది. వైమానిక దాడులతో నిప్పులు కురిపిస్తోంది. ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా, శాంతియుత వాతావరణానికి భంగం వాటిల్లేలా హమాస్ వ్యవహరిస్తోందని, దాడులకు పాల్పడిన తీవ్రమైన నేరానికి పాల్పడిందని ఇజ్రాయెల్ హెచ్చరించింది.

తాజాగా ఈ యుద్ధం పొరుగు దేశాలకు విస్తరించింది. హమాస్ మిలిటెంట్లకు ప్రత్యక్షంగా సహకారాన్ని అందిస్తోన్న సిరియాపై ఎదురుదాడికి దిగింది ఇజ్రాయెల్. సిరియా భూభాగంపై నుంచి ఆ దేశ సైన్యం చేస్తోన్న రాకెట్ల దాడులను తిప్పి కొడుతోంది. ఈ క్రమంలో సిరియా సైనిక యూనిట్లపై మోర్టార్లను సంధిస్తోంది.

ఈ విషయాన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ ప్రకటించింది. తమ దేశంపై సిరియా దాడులు చేపట్టిందని, దీనికి ప్రతీకారం తీర్చుకుంటోన్నామని పేర్కొంది. ఈ తెల్లవారు జామున సిరియా సైనిక శిబిరాలపై దాడులు మొదలుపెట్టినట్లు వెల్లడించింది. మోర్టార్లను సంధించామని, అవి లక్ష్యాన్ని ఛేదించాయని వివరించింది.

సిరియా భూభాగంపై నుంచి ఇజ్రాయెల్‌లోని గోలన్ హైట్స్‌పై రాకెట్లను సంధించారు. ఈ దాడికి తామే బాధ్యత వహిస్తోన్నట్లు సిరియా సైన్యం తెలిపింది. దీనికి ఐడీఎఫ్ ప్రతిదాడికి సిద్ధపడింది. క్రమంగా ఇది మరింత ఉధృతరూపం దాల్చే అవకాశం లేకపోలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+