వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇరాన్ అణుశాస్త్రవేత్తను హతమార్చిన ఇజ్రాజెల్-అత్యాధునిక రోబో సాయం-అంతర్జాతీయంగా చర్చ

|
Google Oneindia TeluguNews

ఇరాన్ అంటేనే అంతెత్తున్న లేచే ఇజ్రాజెయ్ల తాజాగా ఆ దేశానికి చెందిన అణుశాస్త్రవేత్తను అత్యాధునిక పద్దతుల్లో హతమార్చడం అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఇరాన్ అణుశాస్త్రవేత్త మొహసిన్ ఫక్రిజాదేను ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొస్సాద్ హతమార్చిన తీరు కలకలం రేపుతోంది.

ఇస్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ, మొసాద్ రిమోట్ కంట్రోల్డ్ రోబోట్ ఉపయోగించి ఇరాన్ అణు కార్యక్రమ పితామహుడు, ప్రధాన సైనిక శాస్త్రవేత్త కూడా అయిన మొహసిన్ ఫక్రిజాదేను హత్య చేసింది. మొహ్సేన్ ఫక్రిజాదే ఇరాన్ ఎలైట్ పారామిలిటరీ ఫోర్స్ అయిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) లో బ్రిగేడియర్ జనరల్. టెహ్రాన్ తూర్పు శివార్లలో జరిగిన సాయుధ దాడిలో ఆయన గతేడాది నవంబర్ 27న భార్యతో పాటు హత్యకు గురయ్యారు.. పట్టపగలు 3 నిమిషాల్లోపే జరిగిన ఈ దాడిలో ఎవరినీ ఇప్పటివరకూ అరెస్టు చేయలేదని తెలుస్తోంది.

Israels mossad killed Iranian nuclear scientist fakhrizadeh using advanced robotic device

ఫక్రిజాదే హత్య జరిగిన కొంత కాలానికే, ఇరాన్ అధికారులు మొసాద్ అతని హత్యకు కారణమని పేర్కొన్నారు. ఇరానియన్ మీడియాలోనూ దీనిపై వార్తలు వచ్చాయి. ఈ ఏడాది ఫిబ్రవరిలో లండన్‌ వారపత్రిక ది జ్యూయిష్ క్రానికల్, మొరాద్ IRGC జనరల్‌ని "ఎనిమిది నెలల పాటు ఇరాన్‌కు అక్రమంగా రవాణా చేసిన ఒక టన్ను రిమోట్-కంట్రోల్డ్ గన్‌ని ఉపయోగించి చంపేసినట్లు పేర్కొంది. అయితే ఈ కథనానికి ఎలాంటి నిర్ధారణ లేకపోవడం విశేషం.

Israels mossad killed Iranian nuclear scientist fakhrizadeh using advanced robotic device

Recommended Video

Rafale Fighter Jets ఉన్న UAE ఎయిర్‌బేస్‌లో Iranian క్షిపణుల విన్యాసాలు ? లక్ష్యం America ?

తాజాగా ది న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం ఫక్రిజాదేహ్‌ను రిమోట్-కంట్రోల్డ్ అడ్వాన్స్‌డ్ రోబోటిక్ పరికరం ద్వారా చంపినట్లు మరో కథనం ప్రచురించింది. ఇందులో మొసద్ ఒక ప్రసిద్ధ ఇరానియన్ నిర్మిత నిస్సాన్ పికప్ ట్రక్ మోడల్ నీలిరంగు జమ్యాద్ మంచం మీద ఈ పరికరాన్ని అమర్చినట్లు తెలిపింది. బెల్జియన్ తయారీ FN MAG 7.62-mm మెషిన్ గన్ డెకాయ్ నిర్మాణ సామగ్రి, భారీ టార్పాలిన్ కింద దీన్ని దాచినట్లు ఈ కథనం పేర్కొంది. ఈ పరికరాన్ని మొసాద్ ఇరాన్‌లోకి అక్రమంగా రవాణా చేసిందని ది యూదు క్రానికల్ కథనం చేసిన వాదననే న్యూయార్క్ టైమ్స్ కూడా సమర్ధించింది.

English summary
israel's intelligence agency reportedly killed iran nuclear scientist mohsen fakhrizadeh using advanced robotic device.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X