Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ISrael-Hamas: గాజాలోకి వెళ్లడానికి సిద్ధమైన ఇజ్రాయెల్ దళాలు..

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం 14వ రోజు కొనసాగుతోంది. గాజాలో ఇజ్రాయెల్ వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఐడీఎఫ్‌ బలగాలకు గాజాలో అడుగుపెట్టడానికి అనుమతి ఇచ్చినట్లు ఇజ్రాయెల్ మంత్రి నిర్ బరాకత్ తెలిపారు. ఇజ్రాయెల్ పై దాడి చేసిన ఉగ్రవాదులే తమ టార్గెట్ అని ఆయన స్పష్టం చేశారు. గాజాలోని హమాస్ భూగర్భ సొరంగాలు ప్రపంచంలోనే అతిపెద్ద సమాధిగా మారబోతున్నాయని ఆయన చెప్పారు.

యునైటెడ్ స్టేట్స్ ఇజ్రాయెల్‌కు తన మద్దతును పునరుద్ఘాటించింది. హమాస్ చేతిలో ఉన్న బందీల విడుదలను అత్యంత ప్రాధాన్యతగా ఉంటుందని స్పష్టం చేసింది. ఇప్పటికీ హమాస్‌ చెరలో దాదాపు 200 మందికిపైగా బందీలు ఉన్నారు. హమాస్‌ను ఎదుర్కొనే ప్రయత్నాల్లో ఇజ్రాయెల్‌కు సహాయం చేయడమే కాకుండా గాజాకు మానవతా సహాయాన్ని అందించడానికి కూడా యునైటెడ్ స్టేట్స్ సిద్ధంగా ఉందని US స్టేట్ డిపార్ట్‌మెంట్ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ తెలిపారు.

Israeli forces prepare to move into Gaza

అల్-అహ్లీ హాస్పిటల్‌లో జరిగిన పేలుడుకు ఇజ్రాయెల్ వైమానిక దాడికి కారణమని యుఎస్ ఇంటెలిజెన్స్ చెప్పడం లేదని అధ్యక్షుడు జో బిడెన్, యుఎస్ అధికారులు గురువారం దీనిని పునరుద్ఘాటించారు. అక్టోబరు 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై దాడి చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఇజ్రాయెల్ గాజాపై వరుస దాడులు చేస్తోంది. హమాస్ దాడిలో కనీసం 1,400 మంది పౌరులు మరణించారని, ఆ తర్వాత జరిగిన ఘర్షణల్లో దాదాపు 1,500 మంది ఇస్లామిక్ యోధులు మరణించారని ఇజ్రాయెల్ పేర్కొంది. ఇజ్రాయెల్ బాంబు దాడులు పాలస్తీనియన్లు భారీగా ప్రాణాలు కోల్పోయారు. గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకారం ఇప్పటి వరకు 3,785 మంది మరణించారు.

హమాస్‌ను నిర్మూలించడానికి గాజా స్ట్రిప్‌లో గణనీయమైన భూదాడిని ప్రారంభించే అవకాశాన్ని ఇజ్రాయెల్ సీనియర్ అధికారులు పరిశీలిస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లాడుతున్నారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ సదరన్ కమాండ్ అధిపతి, మేజర్ జనరల్ యారోన్ ఫింకెల్మాన్ భూదాడి దీర్ఘంగా, తీవ్రంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+