అక్కడ.. యుద్ధ వాతావరణం: భారీగా దాడులు
Iran Israel War: మధ్య- తూర్పు దేశాల్లో తీవ్ర ఉద్రిక్త వాతారణం నెలకొంది. ఇరాన్‌పై యుద్ధానికి దిగింది ఇజ్రాయెల్. ప్రతీకార దాడులను సాగిస్తొంది. డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడుతోంది. సరిహద్దుల్లో గల సెంట్రల్ ఇరాన్‌లోని ఇష్ఫహార్ ప్రావిన్స్‌లో భారీగా పేలుళ్లు సంభవించాయి.
గత ఏడాది ఇజ్రాయెల్.. పాలస్తీనాపై యుద్ధానికి దిగిన విషయం తెలిసిందే. ఏడు నెలలుగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. పాలస్తీనియన్ ఇస్లామిక్ జిహాద్, హమాస్ ఉగ్రవాదుల స్థావరాలనపై రాకెట్లను సంధించింది. గాజా స్ట్రిప్‌పై బాంబుల వర్షాన్ని కురిపించిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. 30 మందికి పైగా సాధారణ పౌరులు దుర్మరణం పాలయ్యారు.

ఈ క్రమంలో కొద్దిరోజుల కిందటే ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార చర్యలను తీసుకొంది. 200 డ్రోన్లు, మిస్సైళ్లను సంధించింది. ఇరాన్ మిత్రదేశాలు సైతం ఇందులో పాలుపంచుకొన్నాయి. ఇజ్రాయెల్ సైనిక శిబిరాలపై దాడులు నిర్వహించాయి. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ధృవీకరించింది. 200లకు పైగా డ్రోన్లు, మిస్సైళ్లను సంధించినట్లు ఆ దేశ ఆర్మీ ప్రతినిధి చెప్పారు.
సిరియా రాజధాని డమాస్కస్‌లో గల ఇరాన్ రాయబార కార్యాలయం వద్ద కారు బాంబు దాడి ఘటన చోటు చేసుకున్న కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్‌పై ఈ ప్రతిదాడి చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. రాయబార కార్యాలయం వద్ద దాడికి ఇజ్రాయెల్ కారణమని ఇరాన్ ప్రకటించింది. దీనికి ప్రతీకారాన్ని తీర్చుకుంటామనీ హెచ్చరించింది. ప్రతీకార చర్యలను తీసుకుంది.
ఇజ్రాయెల్‌పై ఎడాపెడా దాడులు సాగించింది. ఆత్మ రక్షణలో భాగంగా తాము ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు తెలిపింది. దెబ్బకు దెబ్బ తీయాలనే ఉద్దేశంతో ఉన్నామని తేల్చి చెప్పింది.
దీనిపై ఇజ్రాయెల్ ఎదురుదాడికి దిగింది. ఇరాన్‌పై క్షిపణులను సంధించింది. సెంట్రల్ ఇరాన్‌లోని ఇష్ఫహాన్ ప్రావిన్స్ ఎయిర్‌బేస్ సమీపంలో పేలుళ్లు సంభవించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఈ పేలుళ్లను ఇరాన్ ప్రభుత్వం ధృవీకరించింది. అదే సమయంలో- ఇరాక్, సిరియా దక్షిణ ప్రాంతంలోనూ భారీ పేలుళ్లకు సంభవించినట్లు తెలుస్తోంది.
ఈ దాడుల నేపథ్యంలో ఇరాన్ అప్రమత్తమైంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనడానికి సంసిద్ధంగా ఉండాలంటూ తమ వైమానిక దళాన్ని ఆదేశించినట్లు ఇరాన్ తెలిపింది. ఇదే విషయాన్ని అమెరికా సైతం నిర్ధారించింది. ఈ నేపథ్యంలో టెహ్రాన్, ఇష్ఫహాన్, షిరాజ్‌లకు విమానాలు ఇప్పుడు రద్దు చేసినట్లు తెలిపింది.
-
ఇరాన్ సుప్రీం లీడర్ గా ట్రంప్ ? అమెరికా అధ్యక్షుడి తాజా షాక్..! -
Bay of Pigs: క్యూబాలో అమెరికా ఎలా ఓడిపోయి లొంగిపోయింది ? నెక్ట్స్ ఇరానేనా ? -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
Donald Trump: పీకల్లోతు కష్టాల్లో ట్రంప్-స్వదేశంలో భారీ షాక్..! -
ఇరాన్ క్షిపణి దాడిలో బూడిదైన 'స్టాట్యూ ఆఫ్ లిబర్టీ'.. వీడియో వైరల్ -
భారత్‌కు ఇరాన్ బంపరాఫర్!.. ప్రధాని మోదీ మాస్టర్ ప్లాన్! -
ట్రంప్ సీజ్ ఫైర్ కు నో..! మళ్లీ తీవ్రస్థాయికి ఇరాన్ వార్...! -
హార్ముజ్ రక్షకుడిని చంపేశాం..! ఇజ్రాయెల్ సంచలన ప్రకటన..! -
అమెరికా పరువుతీసిన పాకిస్థాన్.. మంత్రి సంచలన ట్వీట్! -
"ఇరాన్ దెబ్బకు అమెరికా ఖతం.. పీకల్లోతు చిక్కుల్లో.." -
పాకిస్తాన్‌కు ఇరాన్ బిగ్ షాక్.. నో పర్మిషన్.. -
అమెరికా-ఇరాన్ యుద్ధంలో బిగ్ ట్విస్ట్: రంగంలోకి హిజ్బుల్లా..!












Click it and Unblock the Notifications