చంద్రుడిపైకి మరో ప్రయోగం: దూసుకెళ్లిన జపాన్ ‘స్లిమ్’: ఇస్రో, నాసా అభినందనలు
టోక్రో: చంద్రుడిపైకి ప్రయోగాలు కొనసాగుతున్నాయి. ఇస్రో చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ప్రపంచంలోని మరిన్ని దేశాలు ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. చంద్రయాన్-3 తర్వాత రష్యా కూడా చంద్రుడిపైకి రాకెట్ ప్రయోగం చేసినప్పటికీ.. అది క్రాష్ ల్యాండింగ్ కావడంతో ఆ దేశ ప్రయత్నం విఫలమైంది. తాజాగా, జపాన్ దేశం చంద్రుడిపై తొలిసారి అడుగుపెట్టాలని ప్రయోగం చేపట్టింది.
అనివార్య కారణాల వల్ల పలుమార్లు వాయిదా పడిన జపాన్ రాకెట్ ప్రయోగం గురువారం ఉదయం విజయవంతంగా నిర్దేశిత కక్ష్యలోకి చేరింది. నైరుతి జపాన్‌లోని తనెగాషిమా అంతరిక్ష కేంద్రం నుంచి ఎక్స్‌రే టెలిస్కోప్, లూనార్ ల్యాండర్‌ను తీసుకుని హెచ్-2ఏ రాకెట్ నింగిలోకి దూసుకెళ్లింది.

జపాన్ అంతరిక్ష పరిశోధన సంస్థ(JAXA) ఈ ప్రయోగాన్ని లైవ్ స్ట్రీమింగ్ చేసింది. నింగిలోకి దూసుకెళ్లిన 13 నిమిషాల తర్వాత ఎక్స్-రే ఇమేజింగ్ అండ్ స్పెక్ట్రోస్కోపి మిషన్(XRISM) ఉపగ్రహాన్ని హెచ్-2ఏ రాకెట్ భూ కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టినట్లు జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ వెల్లడించింది.
ఆ ప్రయోగం ద్వారా గెలక్సీల మధ్య వేగం, ఇతర పరామితులను తెలుసుకోనుంది. విశ్వ రహస్యాలను ఛేదించేందుకు, ఖగోళ వస్తువులు ఎలా ఏర్పడ్డాయో తెలుసుకునేందుకు ఈ సమచారం ఉపయోగపడుతుందని జపాన్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
✨ Great news! 🛰️
— XRISM (@XRISM_jp) September 7, 2023
Solar acquisition control - ✅,
Data received at Uchinoura station - ✅,
Solar array paddle deployment - ✅.
XRISM is on track! 🚀 #JAXA #SpaceMission #SolarPower pic.twitter.com/mxSZR5dc2j
ఇదే ప్రయోగంలో చంద్రుడి రహస్యాలను తెలుసుకునేందుకు స్లిమ్(SLIM-స్మార్ట్ ల్యాండర్ ఫర్ ఇన్వెస్టిగేటింగ్ మూన్) పేరుతో ఓ తేలికపాటి లూనార్ ల్యాండర్‌ను కూడా పంపించారు. ఈ స్లిమ్ ల్యాండర్.. మూడు-నాలుగు నెలల తర్వాత చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించనుంది. వచ్చే ఏడాది జనవరి-ఫిబ్రవరిలో ఈ స్లిమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనుందని జాక్సా తెలిపింది.
Congratulations @JAXA_en on the successful launch of the SLIM lander to the moon.
— ISRO (@isro) September 7, 2023
Best wishes for another successful lunar endeavour by the global space community. https://t.co/7HSjtoFHx7
చంద్రడు, ఇతర గ్రహాలపైకి పంపించే భవిష్యత్తు ప్రయోగాల కోసం పెన్ పాయింట్ ల్యాండింగ్ టెక్నాలజీతో స్లిమ్ ను అభివృద్ధి చేశారు. సాధారణంగా ల్యాండర్లు నిర్దేశించిన ప్రదేశానికి 10 కిలోమీటర్లు అటుఇటుగా దిగుతుంటాయి. కానీ, ఈ ల్యాండర్ ను మాత్రం నిర్దేశించిన ప్రాంతానికి కేవలం 100 మీటర్లు అటుఇటుగా ల్యాండ్ అయ్యేట్లు రూపొందించారు.
Liftoff! 🚀
— NASA (@NASA) September 7, 2023
Congratulations to the XRISM teams at @JAXA_en, @NASAUniverse, and @ESA on a successful launch!
This new X-ray observatory will help us study exploding stars, black holes, and more.
Learn more: https://t.co/Ul5pHFLvuJ pic.twitter.com/MeaN87uiC9
చంద్రుడిపైకి స్లిమ్ ల్యాండర్‌ను విజయవంతంగా ప్రయోగించడంపై జపాన్‌కు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO).. అంతర్జాతీయ అంతరిక్ష కమ్యూనిటీలో మరో దేశం విజయవంతంగా చంద్రుడిపై కాలు మోపాలని ఆకాంక్షించంది. మరోవైపు, అమెరికాకు చెందిన నాసా కూడా జపాన్‌కు అభినందనలు తెలియజేసింది.
-
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
మీనరాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది కార్యసిద్ధి, ఆర్థిక లాభం.. పూర్తి వివరాలివే! -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి?











Click it and Unblock the Notifications