జపాన్ లో భారీ భూకంపం.. సునామీ అలర్ట్ జారీ

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రత నమోదు అయింది. భూకంప తీవ్రత ధాటికి 3 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు.

జపాన్ లో భారీ భూకంపం సంభవించింది. రెక్టర్ స్కేల్ పై 7.6 తీవ్రత నమోదు అయింది. భూకంప తీవ్రత ధాటికి 3 మీటర్ల ఎత్తులో సముద్రపు అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో సునామీ హెచ్చరికలు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. భారీ భూకంపం నేపథ్యంలో హోక్కైడో, ఓమోరీ ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయినట్లు అధికారులు స్పష్టం చేశారు. భూకంపం ఓమోరీ సముద్ర తీరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో 50 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) పేర్కొంది.

Japan Quake Chaos 7 6-Magnitude Tremor Hits Northeast Tsunami Warning Issued for Hokkaido

జపాన్ ను మరోసారి భారీ భూకంపం వణికించింది. ఉత్తర జపాన్‌, తూర్పు జపాన్ ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. దీంతో వాతావరణ శాఖ హోక్కైడో, ఓమోరీ ప్రాంతాల్లో సునామీ హెచ్చరికలు జారీ అయినట్లు అధికారులు స్పష్టం చేశారు. భూకంపం ఓమోరీ సముద్ర తీరం నుంచి 80 కిలోమీటర్ల దూరంలో 50 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు జపాన్ వాతావరణ సంస్థ (జేఎంఏ) స్పష్టం చేసింది.

స్థానిక కాలమానం ప్రకారం భూకంపం రాత్రి 11 గంటల 15 నిమిషాల సమయంలో సంభవించినట్లు తెలిపారు అధికారులు. హోక్కైడో, ఓమోరీ తీర ప్రాంతాల్లో సముద్రపు అలలు దాదాపు 3 మీటర్లు అంటే 10 అడుగుల మేర ఎగిసిపడే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. హోక్కైడో, ఓమోరీ ప్రాంతాల్లో 40 సెంటీ మీటర్ల మేర సునామీ అలలు తాకినట్లు వివరిస్తున్నారు. మరోవైపు భూకంప ప్రభావిత ప్రాంతాల్లో న్యూక్లియర్​ పవర్​ ప్లాంట్స్​ ఉన్నట్లు సమాచారం. అందుకే అధికారులు వీటిల్లో భద్రతా తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+