భారత్ తో గొడవల వేళ- అమెరికాలో అధికార మార్పిడి?- సిద్ధంగా ఉన్నానన్న జేడీ వాన్స్

ఇష్టానుసారంగా విధిస్తోన్న టారిఫ్ లతో భారత్ సహా అన్ని దేశాలనూ బెంబేలెత్తిస్తోన్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. రష్యాను బద్ధశత్రువుగా పరిగణిస్తోన్నారు. ఆ దేశంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు పెట్టుకున్న.. ప్రత్యేకించి- క్రూడాయిల్ కొనుగోలు చేస్తోన్న దేశాలన్నింటిపైనా విరుచుకుపడుతున్నారు. కొరడా ఝుళిపిస్తోన్నారు.

ఈ క్రమంలో భారత్ పై ఇప్పటికే ఎకాఎకిన 50 శాతం అదనపు టారిఫ్ లను విధించారు డొనాల్డ్ ట్రంప్. తొలుత- 25 శాతంతో సరిపెట్టుకున్నాడనుకున్నప్పటికీ- ఆ తరువాత తాజాగా మరో 25 శాతం అదనపు వడ్డింపులు వడ్డించారు. ఫలితంగా 50 శాతం టారిఫ్ భారం భారత్ పై పడింది.

JD Vance Stands Ready to Step In What Happens in a Terrible Tragedy

ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు చేసే దేశాలపై మరో విడత టారిఫ్ పెంచడానికి, ఆంక్షలు విధించడానికి అవకాశాలు లేకపోలేదని డొనాల్డ్ ట్రంప్ తాజాగా హెచ్చరించారు. సెకెండరీ ఆంక్షలు మరింత కఠినంగా ఉంటాయనీ పేర్కొన్నారు.

దీనిపై కొంత వ్యతిరేకత ఎదురుగాలి వీస్తోంది ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కు. భారత్ పై ఆంక్షలు విధించడం, అడ్డదిడ్డంగా టారిఫ్ పెంచడం సరికాదని కొంతమంది సెనెటర్లు, హౌస్ ఆఫ్ కాంగ్రెస్ రెప్రజెంటేటివ్స్ బాహటంగానే తప్పుపట్టారు. నిక్కీ హేలీ సైతం ఇవే వ్యాఖ్యలు చేశారిదివరకు.

ఈ పరిణామాల మధ్య ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇచ్చిన ఇంటర్వ్యూ తెరపైకి వచ్చింది. అవసరమైతే తాను దేశాధ్యక్ష బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నానని తేల్చి చెప్పారు. ట్రంప్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. అనారోగ్యం లేదా ఏదైనా కారణంతో ట్రంప్ తప్పుకోవాల్సి వస్తే తాను అధ్యక్ష పగ్గాలను స్వీకరిస్తానని అన్నారు.

యూఎస్ఏ టుడేకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు వాన్స్. డొనాల్డ్ ట్రంప్ వారసుడిగా ఎవరు ఉండొచ్చంటూ విలేకరి అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. ట్రంప్ వారసుడిని తానేనని అన్నారు. అధ్యక్షుడికి ఉపాధ్యక్షుడే వారసుడని వ్యాఖ్యానించారు. ఇందులో ఎటువంటి సందేహాలకు అవకాశం లేదని తేల్చి చెప్పారు.

డొనాల్డ్ ట్రంప్ ఆరోగ్యంపై ఎటువంటి వార్తలు వచ్చినా అవి నిరాధారమైనవేనని జేడీ వాన్స్ అన్నారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో, వందశాతం ఎనర్జీతో ఉన్నారని చెప్పారు. ట్రంప్ చుట్టూ పనిచేసే సిబ్బందిలో చాలామంది యువకులే ఉన్నారని- అయినప్పటికీ ఆయనతో పోటీ పడలేరని పేర్కొన్నారు.

చిట్టచివరిగా విరామం తీసుకునేది.. అందరికంటే ముందు నిద్రలేచి, విధులకు హాజరయ్యేది ట్రంపేనని అన్నారు. పూర్తి పదవీకాలాన్ని అనుభవిస్తారని, దేశ ప్రజలకు గొప్ప పనులు చేస్తారని నమ్మకం తనకు ఉందని వాన్స్ పేర్కొన్నారు. ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని, కొన్ని భయంకరమైన విషాదాలు చెప్పకుండా వస్తాయని జేడీ వాన్స్ వ్యాఖ్యానించారు.

అలాంటి సందర్భమే వస్తే- తాను అధ్యక్ష బాధ్యతలను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. 2028లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా జేడీ వాన్స్ పోటీ చేస్తాడంటూ ఇటీవలే వ్యాఖ్యానించారు డొనాల్డ్ ట్రంప్. అత్యంత సమర్థుడిగా అభివర్ణించారు. 40 ఏళ్ల మాజీ మెరైన్ అయిన వాన్స్, ట్రంప్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+