కూసాలు కదిలాయ్.. పక్కా ప్రూఫ్స్‌తో నిప్పుల వర్షం

India Pakistan War: అంచనాలకు తగ్గట్టే- పాకిస్తాన్‌పై భారత్ యుద్ధానికి దిగింది. వైమానిక దాడులు సాగించింది. బుధవారం తెల్లవారు జామున ఈ దాడులు చేపట్టింది. శతృదేశం ఊపిరి సలపనివ్వలేదు భారత్. ఏకధాటిగా మిస్సైళ్లను సంధించింది. ఈ మిషన్‌కు భారత్ పెట్టిన పేరు ఆపరేషన్ సింధూర్.

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో కిందటి నెల 22వ తేదీన ఉగ్రవాదులు సాగించిన నరమేధానికి ప్రతీకారమే ఈ యుద్ధం. 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నా ఉగ్రవాదులు. ఈ ఘాతుకానికి పాకిస్తాన్ కారణమంటూ మొదటి నుంచీ భారత్ వాదిస్తూ వచ్చింది. యుద్ధ సన్నాహకాలనూ చేపట్టింది.

JeM LeT Hizbul Mujahideen terror groups hit during Indian missile strikes

తాజాగా ప్రత్యక్ష యుద్ధానికి దిగింది భారత్. తెల్లవారు జామున 2 గంటల సమయంలో చిక్కటి చీకటిని చీల్చుకుంటూ తొలి మిస్సైల్ పాకిస్తాన్ భూభాగంపై పడింది. ఇక దాని తరువాత ఒకదాని వెంట ఒకటి భారత క్షిపణులు పాకిస్తాన్ గడ్డపై కనీవినీ ఎరుగని విధంగా విధ్వంసాన్ని సృష్టించాయి.

దశాబ్దాల కాలంగా పాకిస్తాన్ భూభాగంపై ఉంటూ యథేచ్ఛగా తమ కార్యకలాపాలను నిర్వహిస్తూ వస్తోన్న ఉగ్రవాద సంస్థలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఈ వైమానిక దాడులను చేపట్టింది. ఉగ్రవాదాన్ని ఉద్దేశపూరకంగా పెంచి పోషిస్తూ వచ్చిన పాకిస్తాన్ పీచమణచాలనేదే ఈ దాడుల ముఖ్య ఉద్దేశం.

తాజా దాడులు కూడా ఉగ్రవాద శిబిరాలను టార్గెట్‌గా చేసుకునే సాగాయి. ఈ మిస్సైళ్ల దాడిలో జైషె మహ్మద్, లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాద శిబిరాలు ధ్వంసమైనట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. పాకిస్తాన్ భూభాగంపై ఉండే ఉగ్రవాద శిబిరాలే తమ లక్ష్యమని పేర్కొన్నాయి.

తాజా దాడుల్లో జైషె మహ్మద్ ఉగ్రవాద సంస్థకు భారీ నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. బహవాల్‌పూర్‌ అహ్మద్‌పూర్ ఈస్ట్‌లో సుభాన్ మసీద్ ప్రాంతంలో చాలాకాలం నుంచీ కొనసాగుతూ వస్తోన్న జైషె మహ్మద్ సంస్థకు చెందిన నాలుగు ఉగ్రవాద శిబిరాలు నేలమట్టం అయ్యాయి.

ముజఫ్ఫరాబాద్‌లో బిలాల్ మసీద్ ప్రాంతంలో మరో ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన మూడు ఉగ్రవాద శిక్షణ శిబిరాలు ధ్వంసమైనట్లు ఆర్మీ వర్గాలు ధృవీకరించాయి. దీనితో పాటు సియాల్‌కోట్‌లో మురిడ్కె, కోట్కి, షక్కర్‌ఘర్‌‌లల్లో ఉన్న హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన రెండు క్యాంపులు చెల్లాచెదురు అయ్యాయని పేర్కొన్నాయి.

వాటి వివరాలు ఇవీ..

జైషె మహ్మద్- మర్కజ్ సుభాన్ అల్లా, బహవల్‌పూర్

లష్కరే తొయిబా- మర్కజ్ తైబా మురిడ్కె

సర్జల్, టెహ్రా కలాన్- జైషె మహ్మద్,

మెహమూనా జోయా, సియాల్‌కోట్- జైషె మహ్మద్, మర్కాజ్ అహ్లె హదిల్, బర్నాలా- లష్కరే తొయిబా

మర్కజ్ అబ్బాస్, కోట్లి- జైషె మహ్మద్

మస్కర్ రాహీల్ షాహిద్, కోట్లి - హిజ్బుల్ ముజాహిదీన్

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+