దర్జాగా వైట్‌హౌస్‌కు ట్రంప్: ప్రమాణ స్వీకారానికి ముందే: బైడెన్‌తో భేటీ
Donald Trump: ఇటీవలే ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్.. ఇక ప్రమాణ స్వీకారానికి సన్నాహాలు చేసుకుంటోన్నారు. 47వ అధ్యక్షుడిగా వచ్చే ఏడాది జనవరి 20వ తేదీన అధ్యక్షుడిగా ట్రంప్, ఉపాధ్యక్షుడిగా జేడీ వాన్స్ ప్రమాణం చేయనున్నారు.
ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తిగా ముగిసింది. 295 ఎలక్టోరల్ ఓట్లతో సునామీ సృష్టించారు డొనాల్డ్ ట్రంప్. 50.70 శాతం ఓట్లతో అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఆయనకు పోల్ అయిన మొత్తం ఓర్ల సంఖ్య ఏడు కోట్లను దాటింది. 7,32,98,740గా లెక్క తేలింది.డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్‌కు పడ్డ ఓట్ల శాతం 47.70. మొత్తంగా 6,89,71,195 ఓట్లకే ఆమె పరిమితం కావాల్సి వచ్చింది.

ఈ స్థాయిలో రిపబ్లికన్ పార్టీని గెలిపించడంలో కీలకంగా వ్యవహరించారు సుసీ విల్స్. డొనాల్డ్ ట్రంప్ ప్రచార కార్యక్రమాల అధినేత్రి. ఆమె పర్యవేక్షణలోనే ట్రంప్ ఎన్నికల ప్రచార ర్యాలీలు కొనసాగాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి ర్యాలీలను నిర్వహించాల్సి ఉంటుందనే విషయాలపై సమగ్ర షెడ్యూల్‌ను రూపొందించింది ఆమెనే. దానికి అనుగుణంగా ట్రంప్ ర్యాలీలు కొనసాగాయి.
ఎన్నికల ప్రక్రియ ముగిసీ ముగియంగానే సుసీ విల్స్‌కు తన ప్రభుత్వంలో కీలక పదవిని అప్పగించారు డొనాల్డ్ ట్రంప్. ఆమెను తన అధికారిక నివాసం వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా అపాయింట్ చేశారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆయన సంతకం చేశారు. ఎన్నికల తరువాత పెట్టిన తొలి సంతకం ఇదే.
ఈ విజయం ఇచ్చిన ఊపులో ఉన్న డొనాల్డ్ ట్రంప్.. వైట్ హౌస్‌లో దర్జాగా అడుగు పెట్టబోతున్నారు. దీనికి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 13వ తేదీన అధ్యక్షుడి అధికారిక నివాసానికి వెళ్లనున్నారు. ఆ దేశ కాలమానం ప్రకారం ఉదయం 11 గంటలకు ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌తో భేటీ కానున్నారు.
ఈ మేరకు వైట్ హౌస్ ప్రెస్ సెక్రెటరీ కెరిన్ జీన్- పెర్రీ ఓ ప్రకటన విడుదల చేశారు. అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను జో బైడెన్ వైట్ హౌస్‌కు ఆహ్వానించారని, దీనికి ఆయన అంగీకరించారని పేర్కొన్నారు. ఈ నెల 13వ తేదీన ఉదయం 11 గంటలకు వైట్ హౌస్‌లోని ఓవల్ ఆఫీస్‌లో వారిద్దరూ భేటీ అవుతారని చెప్పారు.
ఈ భేటీ సందర్భంగా ఈ నాలుగు సంవత్సరాల తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, విధానాల గురించి క్లుప్తంగా వివరిస్తారని చెప్పారు. ఈ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ ఓటమిని జో బైడెన్ అంగీకరించారని, తమ ఓటమికి ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, కొన్ని దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధపూరక వాతావరణం అని భావిస్తోన్నారని అన్నారు.
-
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..!












Click it and Unblock the Notifications