అధ్యక్ష ఎన్నికల వేళ.. మోదీని ఆహ్వానించిన జో బైడెన్
US Presidential election 2024: గడువు దగ్గర పడుతున్న కొద్దీ అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేడిగా పతాక స్థాయికి చేరుకుంటోంది. ఎన్నికల ప్రచార ర్యాలీలు, పబ్లిక్ మీటింగ్‌లతో అక్కడి రాష్ట్రాలు హోరెత్తిపోతున్నాయి. అధికారాన్ని నిలబెట్టుకోవడానికి డెమోక్రాట్లు, గెలిచి తీరాలనే పట్టుదలతో రిపబ్లికన్లు పోరాడుతున్నారు.
ఈ ఏడాది నవంబర్ 5వ తేదీన అక్కడ పోలింగ్ జరుగనుంది. డెమోక్రాట్ల తరపున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో దిగిన విషయం తెలిసిందే. వారిద్దరూ తమ ప్రచార కార్యక్రమాలు, డిబేట్లను ముమ్మరం చేశారు.

ఈ పరిస్థితుల మధ్య అమెరికా నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆహ్వానం అందింది. తమ దేశ పర్యటనకు రావాల్సిందిగా అధ్యక్షుడు జో బైడెన్ మోదీకి ఆహ్వానం పంపించారు. దీనికి మోదీ అంగీకారం తెలియజేయాల్సి ఉంది. ఆయన అమెరికా పర్యటనపై నేడు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రకటన, షెడ్యూల్ విడుదల చేయ్యొచ్చు.
క్వాడ్ సభ్య దేశాల సమావేశానికి అమెరికా ఆతిథ్యాన్ని ఇవ్వబోతోండటమే దీనికి కారణం. ఈ నెల 21వ తేదీన డెలావర్‌లోని విల్మింగ్టన్‌లో ఈ సదస్సు ఏర్పాటు కానుంది. ఇన్- పర్సన్ క్వాడ్ సమ్మిట్ ఈ ఏడాది విల్మింగ్టన్‌లో ఏర్పాటు కాబోతోండటం ఇదే తొలిసారి.
క్వాడ్‌లో ఆతిథ్య అమెరికాతో పాటు భారత్, ఆస్ట్రేలియా, జపాన్‌లకు సభ్యత్వం ఉంది. జో బైడెన్, మోదీతో పాటు ఆస్ట్రేలియా, జపాన్ ప్రధానమంత్రులు ఆంథోని అల్బెనీస్, ఫ్యుమియో కిషిడ ఈ సమ్మిట్‌కు హాజరు కానున్నారు. 2021లో వైట్‌హౌస్‌లో మొట్టమొదటి క్వాడ్ లీడర్స్ సమ్మిట్ ఏర్పాటైంది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఈ భేటీ ఏర్పాటవుతూ వచ్చింది.
ఈ మధ్యకాలంలో క్వాడ్ సభ్య దేశాల విదేశాంగ మంత్రులు ఎనిమిది సార్లు సమావేశం అయ్యారు. సభ్య దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడం, ఫ్రీ అండ్ ఓపెన్ ఇండో-పసిఫిక్ రీజియన్ ఏర్పాటుకు ప్రాధాన్యత ఇవ్వడం, ఆరోగ్య భద్రత, విపత్తుల నిర్వహణ, సరిహద్దుల భద్రత, మౌలిక సదుపాయాల కల్పన, వాతావరణ మార్పులు, సైబర్ సెక్యూరిటీ అంశాలపై చర్చిస్తారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications