రూల్ ఫర్ ఆల్: బురఖా ధరిస్తోన్న జర్నలిస్టులు.. తాలిబన్ల ఏలుబడిలో ఇలా..

ఆఫ్ఘానిస్తాన్‌లో 24 గంటల్లోనే చాలా మార్పు కనిపిస్తోంది. తాలిబన్లు అంటేనే హడల్.. ఇక మీడియా ప్రతినిధులు సైతం బుర్ఖాలు వేయడం స్టార్ట్ చేశారు. వ్యక్తులెవరైనా సరే.. ఒకటే రూల్ అనే చందంగా విచ్ఛలవిడిగా చెలరేగుతున్న ఆగడాల నుంచి మీడియా ప్రతినిధులు సైతం జాగ్రత్తపడుతున్నారు. బుర్ఖాలు ధరించి రిపోర్టింగ్ కంటిన్యూ చేస్తున్నారు.

జర్నలిస్టులను ప్రొటెక్ట్ చేయడం కోసం ఏర్పాటు చేసిన కమిటీ తాలిబాన్ల దాడి నుంచి తప్పించుకోవాలంటే జర్నలిస్టులు బుర్ఖాలు తప్పనిసరిగా ధరించాలని చెప్పింది. కాబుల్‌లోకి ప్రవేశించిన తాలిబాన్లు మొత్తం ఆధీనంలోకి తెచ్చుకోవడంతో దేశాధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న అష్రఫ్ ఘనీ దేశం వదలిపారిపోయారు. గతవారం అనుమానస్పద అఫ్ఘన్ రేడియో స్టేషన్ మేనేజర్‌ను కూడా తాలిబాన్ ఫైటర్లు హత్య చేశారు. జర్నలిస్ట్ కమ్యూనిటీలో భయం పుట్టించాలనే ఇలా చేసినట్లు సమాచారం.

journalists are wear burqa in Afghanistan

జర్నలిస్టుల విషయంలో ప్రత్యేకించి మహిళలపై ప్రత్యేక ఆంక్షలు ఉన్నాయి. చాలా ఏళ్లుగా, బోల్డ్‌గా స్వతంత్ర్యంగా రిపోర్టింగ్ చేయగలిగాం అని.. ఇప్పుడు భయపడాల్సి వస్తుందని ఒక సీనియర్ రిపోర్టర్ అభిప్రాయపడ్డారు. ఇకపై పనిచేస్తామా అనే అనుమానం కూడా ఉందని చెప్పారు. ఈ ఏడాది కనీసం ముగ్గురు మహిళా జర్నలిస్టుల హత్య జరిగిందన్నారు. వారిలో ఒకరి గన్‌మన్‌ను స్పాట్‌లో కాల్చేసి హత్య చేశారని చెప్పారు. సొసైటీలో జరిగే ప్రతి విషయాన్ని ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశ్యంతో బయటికొచ్చే జర్నలిస్టులు అనుక్షణం భయపడుతూ.. బుర్ఖాలు ధరించే రిపోర్టింగ్ చేస్తున్నారని వివరించారు.

కాబుల్ పరిసరాల్లో గతంలో లేనంతగా బుర్ఖాలు అమ్ముడుపోతున్నాయట. మహిళల పట్ల కఠిన ఆంక్షలతో వ్యవహరిస్తున్న తాలిబాన్లు యుక్త వయస్సు వచ్చిన మహిళలు, రెండెంకల వయస్సు వచ్చిన బాలికలపై బోలెడు నిబంధనలు ఉండాలని చెబుతున్నారు. ప్రజలను సురక్షితంగా ఉంచుతామని చెప్పినప్పటికీ, వారి వైఖరి పట్ల అఫ్ఘానిస్తానీయులు భయపడుతూనే ఉన్నారు.

చాలామందిలో తాలిబాన్లు మళ్లీ ఆఫ్ఘనిస్తాన్‌ను 20ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిపోతారనే భయం కనిపిస్తుంది. కాబుల్ నుంచి ఢిల్లీకి వచ్చిన ఒక మహిళ మాట్లాడుతూ ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రపంచం మద్దతుగా నిలుస్తుందనే నమ్మకం తనకు లేదన్నారు. తన స్నేహితురాలు తాలిబన్ చేతిలో హతమైందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు అఫ్ఘానిస్తాన్ లో ఎటువంటి అధికారాలు లేవంటూ వాపోయారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+