నడిచి వెళ్లేంత దూరం.. కానీ 21 గంటల తేడా! అమెరికా-రష్యా సరిహద్దుల్లో వింత లోకం!!

రష్యా, అమెరికా.. ఈ రెండు దేశాల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందని మనందరికీ తెలిసిందే. అయితే ప్రపంచ పటంలో ఈ రెండు అగ్రరాజ్యాలు ఒకచోట కేవలం 3.8 కిలోమీటర్ల దూరంలో ఉంటాయన్న విషయం మీకు తెలుసా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. ఇదే నిజం. ప్రపంచంలోనే అత్యంత వింతైన భౌగోళిక సరిహద్దు డియోమెడ్ దీవులు. ఇవి బేరింగ్ సముద్రంలో అమెరికాలోని అలాస్కా, రష్యాలోని సైబీరియా మధ్య ఉన్నాయి. ఇక్కడ రెండు ద్వీపాలు ఉంటాయి. ఒకటి రష్యాకు చెందిన బిగ్ డియోమెడ్, రెండోది అమెరికాకు చెందిన లిటిల్ డియోమెడ్.

సమయంలో వింత ఆట.. 21 గంటల తేడా!
ఈ రెండు దీవుల మధ్య నుంచే అంతర్జాతీయ దినరేఖ వెళ్తుంది. దీనివల్ల లిటిల్ డియోమెడ్(అమెరికా)లో సోమవారం ఉంటే.. కేవలం 3.8 కిలోమీటర్ల దూరంలో ఉన్న బిగ్ డియోమెడ్(రష్యా)లో అప్పటికే మంగళవారం ఉంటుంది. అందుకే వీటిని 'నిన్నటి ద్వీపం' (Yesterday Island), 'రేపటి ద్వీపం' (Tomorrow Island) అని పిలుస్తారు. వీటి మధ్య దూరం తక్కువే అయినా సమయం మాత్రం 21 గంటల తేడా ఉంటుంది.

Just 3 8 km Apart but 21 Hours Ahead The Strange US Russia Border Explained

అక్కడ ఎవరు ఉంటారు?
లిటిల్ డియోమెడ్ (అమెరికా): ఇక్కడ 'ఇనుపియాట్' తెగకు చెందిన సుమారు 80 మంది నివసిస్తున్నారు. వీరు చేపలు పట్టడం, సీల్ వంటి సముద్ర జీవులను వేటాడటం ద్వారా జీవనం సాగిస్తారు. ఇక్కడ ఎటువంటి సైనిక బలగాలు ఉండవు.

బిగ్ డియోమెడ్ (రష్యా): ఇక్కడ సాధారణ పౌరులు ఎవరూ ఉండరు. 1948లో సోవియట్ యూనియన్ ఇక్కడి స్థానికులను బలవంతంగా తరలించింది. ప్రస్తుతం ఇక్కడ రష్యాకు చెందిన బోర్డర్ గార్డ్స్, వాతావరణ కేంద్రం, సైనిక యూనిట్లు మాత్రమే ఉన్నాయి.

మంచు వంతెన.. కానీ ప్రమాదకరం!
శీతాకాలంలో ఈ రెండు దీవుల మధ్య నీరు గడ్డకట్టి మంచు వంతెనలా మారుతుంది. సిద్ధాంతపరంగా నడిచి ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్లవచ్చు. కానీ ఇలా చేయడం పూర్తిగా చట్టవిరుద్ధం. అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తతల వల్ల సరిహద్దు దాటడానికి ప్రయత్నిస్తే అరెస్టు చేయడమే కాకుండా, ప్రాణాపాయం కూడా ఉండవచ్చు. అందుకే దీనిని 'ఐస్ కర్టెన్' (Ice Curtain) అని పిలుస్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+