హైడ్రామా: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బరిలో భారత సంతతి మహిళ: ట్రంప్‌పై పోటీకి సై?

Kamala Harris: అమెరికా అధ్యక్ష ఎన్నికల వేడి పతాక స్థాయికి చేరుకుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ అధ్యక్ష ఎన్నికల షెడ్యూల్ ఇంకా అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. నవంబర్‌లో పోలింగ్ జరుగనుంది. జనవరి 20వ తేదీన ఆ దేశ కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు.

ట్రంప్‌పై

2019 నాటి ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. జో బైడెన్.. అధ్యక్షుడిగా, భారత సంతతికి చెందిన కమల హ్యారిస్ ఉపాధ్యక్షురాలిగా బాధ్యతలను స్వీకరించారు. రిపబ్లికన్ల తరఫున కూడా అభ్యర్థి మారలేదు. ఆ ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓడిపోయిన మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. మూడోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోన్నారు.

Kamala Harris officially becomes the Presidential candidate for the US elections 2024

అర్ధాంతరంగా వైదొలగిన బైడెన్..

ఈ పరిస్థితుల మధ్య.. జో బైడెన్ ఎన్నికల రేసు నుంచి తప్పుకోవడం చర్చనీయాంశమైంది. తన అభ్యర్థిత్వాన్ని ఆయన ఉపసంహరించుకోవడం ఖాయం అంటూ కొద్దిరోజుల నుంచే యూఎస్ మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురిస్తూ వచ్చింది. చివరికి- అవి వాస్తవ రూపాన్ని దాల్చాయి. ఊహించినట్టే స్వచ్ఛందంగా వైదొలిగారు.

సస్పెన్స్‌కు తెర..

జో బైడెన్ స్థానంలో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారనే సస్పెన్స్‌కు తెర పడింది. ఆ దేశ ప్రస్తుత ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్ పేరు ఖరారైంది. కమలా హ్యారిస్‌ను తమ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించింది డెమొక్రటిక్ పార్టీ టాప్ క్యాడర్.

Kamala Harris officially becomes the Presidential candidate for the US elections 2024

గెలుపుపై ధీమా..

ఈ విషయాన్ని కమలా హ్యారిస్ ధృవీకరించారు. డెమొక్రాట్ల తరఫున అధ్యక్ష అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన పేపర్లపై సంతకం చేసినట్లు వెల్లడించారు. ప్రతి ఓటును పొందడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. నవంబర్‌లో జరిగే ఎన్నికల్లో తామే గెలవబోతోన్నామనే ధీమాను వ్యక్తం చేశారు.

మాజీల మద్దతు..

ఎన్నికల రేసు నుంచి జో బైడెన్ అర్ధాంతరంగా తప్పుకొన్న తరువాత.. ఆయన స్థానాన్ని భర్తీ చేసే విషయంలో తొలిసారిగా వినిపించిన పేరు కమలా హ్యారిస్‌దే. మొదటి నుంచీ ఆమె ఫ్రంట్ రన్నర్‌గానే ఉంటూ వచ్చారు. బిల్ క్లింటన్, బరాక్ ఒబాబా వంటి డెమొక్రటిక్ పార్టీకి చెందిన మాజీ అధ్యక్షులు సైతం ఆమె అభ్యర్థిత్వాన్నే బలపరిచారు.

నాడు హిల్లరీ..

అధ్యక్ష ఎన్నికల్లో ఓ మహిళ పోటీకి దిగడం ఈ ఎనిమిదేళ్ల కాలంలో ఇది రెండోసారి. 2016 నాటి ఎన్నికల్లో డెమొక్రాట్ల తరఫున హిల్లరీ క్లింటన్ పోటీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేతిలో మట్టికరిచారామె. ఇప్పుడు కూడా అదే ట్రంప్‌పై మళ్లీ మహిళా అభ్యర్థిని దింపారు డెమొక్రాట్లు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+