ప్రొఫెషనల్స్‌లా: కంగారూల కిక్‌బాక్సింగ్(వీడియో)
సిడ్నీ: కంగారూలంటేనే ఆస్ట్రేలియా గుర్తుకొస్తుంది. ఆ దేశానికి కంగారూలే ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చాయి. కాగా, అవి చేసే సందడి అందర్నీ ఆకట్టుకుంటాయి. కాగా, ఇటీవల నడిరోడ్డుపై రాత్రిపూట ఓ రెండు కంగారూలు చేసిన కిక్ బాక్సింగ్ విన్యాసాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ హల్‌చల్ చేస్తున్నాయి.
అటుగా కారులో వెళుతున్న కొందరు ప్రయాణికులు కంగారూల కిక్ బాక్సింగ్‌ను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఆ వీడియోలో.. నడిరోడ్డుమీద ఎదురుగా కారు వచ్చి ఫ్లడ్ లైట్లు వేసినా సరే ఏమాత్రం పట్టించుకోకుండా సీరియస్‌గా కొట్టుకుంటున్న దృశ్యాలు కనిపించాయి.ఇకా మీరూ చూసి ఎంజాయ్ చేయండి.
Only in Australia, On the way home from the pub. Skip to 3:30 they run into dads work car and keep going haha Brett TurnerFor licensing/usage please contact licensing@viralhog.com
Posted by Quinton Turner on Sunday, September 27, 2015
కొట్టుకోవడమంటే అలా.. ఇలా కాదు.. ప్రొఫెషనల్ బాక్సింగ్‌కు ఏమాత్రం తీసిపోకుండా పంచ్‌లు విసురుకున్నాయి. ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో మిరియంవాలే ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
కారులో ఉన్న క్వింటిమ్ టర్నర్ అనే వ్యక్తి కంగారూల బాక్సింగ్‌ను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో పెట్టాడు. పోస్ట్ చేసిన అయిదు రోజుల్లోనే 13లక్షల మంది వీడియోను చూశారు. ఇక లైక్స్‌కు, షేర్లకు కొదవేలేదు.












Click it and Unblock the Notifications