ఆత్మాహూతి దాడులకు పాల్పడుతున్న బీఎల్ఏ- భారీ విధ్వంసం: ఫొటో రిలీజ్

Karachi Airport blast: పొరుగుదేశం పాకిస్తాన్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. వారిలో ఇద్దరు చైనా దేశస్థులు ఉన్నారు. 17 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది.

పేలుడు వెనుక గల కారణాలు ఏమిటనేది వెంటనే తెలియరాలేదు. దీనిపై జాతీయ భద్రత అధికారులు, పోలీసులు ముమ్మర దర్యాప్తు చేపట్టారు. విద్రోహ శక్తులే ఈ పేలుడు కారణమై ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ ఘటన తరువాత కరాచీలో హైఅలర్ట్ ప్రకటించారు.

Karachi Blast Baloch Liberation Army releases a photo of suicide bomber Shah Fahd

కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఆదివారం రాత్రి ఈ పేలుడు సంభవించింది. ఎయిర్‌పోర్ట్ పార్కింగ్‌కు కొద్దిదూరంలో నిలిపివుంచిన ఓ ట్యాంకర్‌ పేలిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చైనీయులతో పాటు ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. 17 మంది గాయపడ్డారు.

కీలో మీటర్ దూరం వరకు పేలుడు శబ్దం వినిపించింది. జిన్నా ఎయిర్‌పోర్ట్‌కు దూరంగా ఉండే నార్త్ నజీమాబాద్, చుంద్రీగర్ రోడ్, కరీమాబాద్ వంటి ప్రాంతాల వరకు శబ్దం వినిపించినట్లు డాన్ న్యూస్ తెలిపింది. దాని తీవ్రతకు పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. గాల్లోకి ఎగిరిపడ్డాయి. పూర్తిగా కాలిపోయాయి.

అంబులెన్సులు, పోలీసు వాహనాల సైరన్ మోతలతో సంఘటన స్థలం మొత్తం భీతావహంగా కనిపించింది. సమాచారం అందుకున్న వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు గాయపడ్డ వారిని జిన్నా పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ కాలేజీకి తరలించారు.

కాగా- ఈ దాడికి తామే కారణం అంటూ బలూచ్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. చైనా పెట్టుబడిదారులు, ఇంజినీర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసినట్లు తెలిపింది. ఈ మేరకు బీఎల్ఏ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. తమ ఆత్మాహూతి దళ విభాగమే దీనికి కారణమని అన్నారు.

ఈ ఘటనలో మజీద్ బ్రిగేడ్ యూనిట్‌కు చెందిన ఆత్మాహూతి దళ సభ్యుడు షా ఫహద్ అలియాస్ ఆఫ్తాబ్ వీరమరణం పొందినట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ అధికార ప్రతినిధి చెప్పారు. చైనా పెట్టుబడిదారులు, ఇంజినీర్ల కాన్వాయ్‌ను లక్ష్యంగా చేసుకుని ఆత్మాహూతి దాడి చేసినట్లు పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+