ఆత్మాహుతి దాడి: ఆప్ఘన్ ప్రెసిడెంట్ కర్జాయ్ కజిన్ మృతి

మంగళవారం ఓ వ్యక్తి తన టర్బన్‌లో పేలుడు పదార్థాలు తీసుకు వచ్చాడు. ఈ రోజు ఈద్ హాలీడే. ఈ నేపథ్యంలో అందరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సమయంలో అతను పేలుడు పదార్థాలు తీసుకు వచ్చి ఆత్మాహుతికి పాల్పడ్డాడు. హష్మత్ కర్జాయ్ మృతి చెందాడు.
హష్మత్ కర్జాయ్ తన నివాసంలో వేడుకలు చేసుకుంటున్నారని, సూసైడ్ బాంబర్ అతిథిగా హష్మత్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చాడని కాందహార్ ప్రోవిన్సియల్ గవర్నర్స్ అధికార ప్రతినిధి దవాఖాన్ మినాపాల్ చెప్పినట్లుగా తెలుస్తోంది. హష్మత్‌ను సదరు సూసైడ్ బాంబర్ హగ్ చేసుకొని, ఆత్మాహుతికి పాల్పడ్డారని, దీంతో ఇరువురు మృతి చెందారని చెప్పారు. మరోవైపు, తాలిబన్ లీడర్స్ హింసకు ముగింపు పలకాలని హమీద్ కర్జాయ్ పిలుపునిచ్చారు. తాలిబన్లు శాంతిగా ఉండాలన్నారు.












Click it and Unblock the Notifications