Kemi Badenoch: యూకే కన్సర్వేటివ్ పార్టీ సారథిగా తొలి నల్లజాతి మహిళ, రిషి సునాక్ స్థానంలో
లండన్: గత బ్రిటన్ అధ్యక్ష ఎన్నికల్లో పరాజయం పాలైన కన్సర్వేటివ్ పార్టీ తాజాగా కీలక చర్యలకు ఉపక్రమించింది. పార్టీ సారథిగా కొత్త నాయకత్వాన్ని ఎన్నుకుంది. ఆ పార్టీ ప్రతిపక్ష నేతగా కెమి బాడెనోచ్ ఎన్నికయ్యారు. దీంతో ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా ఉన్న రిషి సునాక్ ఆ బాధ్యతల నుంచి వైదొలగనున్నారు.
ఈ మేరకు శనివారం నిర్వహించిన పార్టీ సంస్థగత ఎన్నికల్లో కన్సర్వేటివ్ పార్టీ నేతలంతా కలిసి కెమి బాడెనోచ్ ను ఎన్నుకున్నారు. 2016 నుంచి ఐదుసార్లు పార్టీ నేతగా ఎంపికైన జెన్‌రిక్‌ను దాటి ఆమె పార్టీ నేతల అభిమానాన్ని పొందడం విశేషం. బాడెనోచ్ కు 53,806 ఓట్లు రాగా.. జెన్‌రిక్‌కు 41,388 ఓట్లు వచ్చాయి.

ఈ సందర్బంగా కెమి బాడెనోచ్ మాట్లాడుతూ.. మన ముందున్న లక్ష్యం చాలా కఠినమైనది. అయినప్పటికీ.. ప్రతిపక్ష స్థానంలో ఉన్న మనం ప్రజల తరపున పోరాడేందుకు సిద్ధంగా ఉండాలి. అధికార లేబర్ పార్టీ ఆగడాలను ఎండగట్టాలి అని పార్టీ సభ్యులకు ఆమె సూచించారు.
కాగా, కన్సర్వేటివ్ పార్టీకి నాయకత్వం వహించబోతున్న తొలి నల్లజాతి మహిళగా బాడెనోచ్ నిలిచారు. ఇప్పటి వరకు ఆ పార్టీకి ముగ్గురు మహిళా నేతలు నాయకత్వం వహించగా.. బాడెనోచ్ నాలుగో మహిళగా నిలిచారు.
బాడెనోచ్ నేపథ్యం, ప్రారంభ జీవితం
నైజీరియన్ తల్లిదండ్రులకు లండన్‌లో జన్మించిన బాడెనోచ్ 16 సంవత్సరాల వయస్సులో యూకేకి తిరిగి రావడానికి ముందు తన ప్రారంభ సంవత్సరాలను నైజీరియాలో గడిపారు. తాను పాఠశాలకు హాజరవుతున్న సమయంలో తనకు తాను మద్దతుగా ఆమె మెక్‌డొనాల్డ్స్‌లో పనిచేశారు. ఆమె యూనివర్శిటీ ఆఫ్ సస్సెక్స్‌లో కంప్యూటర్ సైన్స్‌ని అభ్యసించారు.
ఆ తరువాత బ్యాంకింగ్ నుంచి రాజకీయాలకు మారారు. 25 సంవత్సరాల వయస్సులో కన్జర్వేటివ్ పార్టీలో చేరారు. బాడెనోచ్ రాజకీయ ప్రయాణం 2017లో పార్లమెంటుకు ఎన్నికయ్యే ముందు ఆమె లండన్ అసెంబ్లీలో పని చేయడంతో ప్రారంభమైంది. 2019లో బోరిస్ జాన్సన్.. ఆమెను పిల్లలు, కుటుంబాల కోసం పార్లమెంటరీ అండర్ సెక్రటరీగా నియమించారు. 2022 నాటికి, లిజ్ ట్రస్ ఆమెకు ఇంటర్నేషనల్ ట్రేడ్ కార్యదర్శిగా పదోన్నతి కల్పించారు.












Click it and Unblock the Notifications