తండ్రికి షాక్: బాయ్‌ఫ్రెండ్ కోసం రెండేళ్ల పాప ఏడ్చింది(వీడియో)

లండన్: సాధారణంగా రెండున్నరేళ్ల పిల్లలు ఆట బొమ్మలు లేదా ఇతర వస్తువుల కోసం ఏడుస్తుంటారు. కానీ అదే వయస్సు పాప బాయ్‌ఫ్రెండ్ గురించి అగగడం విడ్డూరం.

అమెరికాకు చెందిన కెన్నెడీ కిర్క్ లాండ్ అనే రెండేళ్ల బాలికకు మేనమామ అంటే చాలా ఇష్టం. మేనమామ దగ్గరకు వెళ్లేప్పుడు అతని రూం మేట్ జేర్డ్ బాగా ఆడించేవాడు. ఫుట్‌బాల్ ప్లేయర్ అయిన జేర్డ్ పాపాయికి బాగా నచ్చాడు.

దీంతో ఆ రెండేళ్ల పాప కిర్క్ లాండ్ తన బాయ్‌ఫ్రెండ్ జేర్డ్ అని, తన బాయ్‌ఫ్రెండ్ తనకి కావాలంటూ మారాం చేసింది. తల్లిదండ్రులు, కుమార్తె మధ్య జరిగిన ఈ ఆసక్తికర సంఘటనను వీడియోగా చిత్రీకరించారు.

20 ఏళ్ల తర్వాత కోరాల్సిన బహుమతి రెండేళ్లకే అడుగుతోంది, ఏం చేయాలి? అంటూ కిర్క్‌లాండ్ కుటుంబం ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో నెటిజన్లు ఆసక్తిగా తిలకించారు. ఇప్పుడీ వీడియో ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తోంది.

అయితే, ఆ పాపను ఆ తండ్రి మందలించాడు. ఈ క్రమంలో వాడివేడు మాటలు కూడా ఆ తండ్రీ కూతుళ్ల మధ్య జరిగాయి. తొలుత ఆ పాప చెప్పిన విషయాన్ని తండ్రి పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఆ ఆలోచనను మనసులో ఉంచుకున్న పాప.. ఓ రోజు ఏకంగా తండ్రి వద్దకు వెళ్లి బాయ్‌ఫ్రెండ్ కావాలని మారాం చేయడంతో అతను అవాక్కయ్యాడు.

నీవు చిన్నపిల్లవని, బాయ్ ఫ్రెండుకు అనుమతించడం కుదరదని చెప్పింది. దీంతో మూతి ముడుచుకున్న కెన్నడీ ఆ తర్వాత ఏడుపు మొదలు పెట్టింది. తండ్రి ఆమెను తీవ్రంగా మందలించాడు. ఆమె ఏడ్చుకుంటూ వెళ్లి తల్లికి చెప్పింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+