Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Donald Trump: ట్రంప్ గురించి ఎవ్వరికీ తెలియని యాంగిల్.. ప్రపంచానికి ఇంత మంచి చేశాడా..?

Trump 2.0: నేడు అమెరికా అధ్యక్షుడిగా డ్రెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా నిలిచిన డొనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యారు. అయితే ఆయన గెలిస్తే ప్రపంచ దేశాలకు ఊహించని కష్టాలు వచ్చేస్తాయ్ అంటూ అనేక మీడియా కథనాలు ఊదర కొట్టేస్తున్నాయ్. అయితే ట్రంప్ తన మెుదటి టర్మ్ 2016లో ఎన్నికైన తర్వాత జనవరి 2021 వరకు ఆర్థిక వ్యవస్థలో తెచ్చిన కృషి ప్రపంచానికి చాలా మంచి చేసిందనే విషయాన్ని అందరూ మరచిపోతున్నారు.

ముందుగా 132 ఏళ్ల అమెరికా చరిత్రలో ఓడిపోయాక రెండవసారి గెలిచిన అధ్యక్షుడిగా ట్రంప్ తన పేరున రికార్డ్ క్రియేట్ చేశారు. ఇండియాలో ఇందిరా గాంధీ సైతం ఇదే తరహా విజయాన్ని గతంలో నమోదు చేశారు. ట్రంప్ వస్తే మళ్లీ దిగుమతులపై సుంకాలు పెంచుతాడని దాంతో ద్రవ్యోల్బణం పెరిగిపోతుందని, గందరగోళం క్రియేట్ అవుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మళ్లీ ద్రవ్యోల్బణం పెరిగితే వడ్డీ రేట్ల పెంపు ఉంటుందనే భయాలు ఉన్నాయి. కానీ గడచిన సారి ప్రెసిడెంట్ హోదాలో ఉన్నప్పుడు ట్రంప్ అమెరికా ఆర్థిక వ్యవస్థకు పెద్ద బూమ్ ఇచ్చారు. ప్రపంచ దేశాలకు చెందిన కంపెనీలు అమెరికాలో తమ ప్లాంట్లను నెలకొల్పి స్థానికులకు ఉద్యోగ అవకాశాలను కల్పించారు. ఇదే క్రమంలో అక్రమ వలసలతో పెరుగుతున్న నిరుద్యోగితను అడ్డుకునేందుకు మెక్సికో-అమెరికా మధ్య పెద్ద వాల్ నిర్మించాడు.

Know How Donald Trump Save US and World Economies in First Term 2016 to 2020 in detail

ట్రంప్ గెలవటానికి ముందు వరకు అమెరికా ఫెడ్ 0.25 శాతం వద్ద వడ్డీ రేటును కొనసాగించింది. దాదాపు ఎనిమిదేళ్ల పాటు ఒబామా హయాంలో రేట్ల పెంపు లేకపోవటంతో ప్రజల వద్ద మనీ సప్లై భారీగా పెరిగింది. దీంతో తర్వాత వచ్చే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవటం కొంత క్లిష్టంగా మారుతుంది. అయితే ఆ సమయంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ రేట్లను పెంచే సాహసం మాత్రం ట్రంప్ హయాంకి ముందు చేయలేదు. అయితే దీనికి కారణం అమెరికాలో అప్పుడు నిరుద్యోగిత భారీగా ఉండటమే. పరిస్థితులు మరింతగా దిగజారతాయనే ఆలోచనతో రేట్లను యథాతథంగా కొనసాగించారు. అయితే అప్పుడే అధికారంలోకి వచ్చిన ట్రంప్ అమెరికాకు వచ్చే వ్యక్తులను నియంత్రించటానికి వీసాల జారీని నిలిపివేశారు. అలాగే అమెరికాలో వ్యాపారం చేయాలంటే ప్లాంట్ ఏర్పాటు చేయాల్సిందేనని కంపెనీలకు తేల్చిచెప్పారు. ఈ చర్యలతో నిరుద్యోగిత తగ్గింది. ఇది ఫెడ్ క్రమంగా వడ్డీ రేట్లను పెంచటానికి ట్రంప్ హయాంలో ధైర్యాన్ని నింపింది.

అందుకే కరోనా సమయంలో అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లను తగ్గించటానికి అవసరమైన కుషన్ ట్రంప్ హయాంలో పెంచిన రేట్ల వల్ల వచ్చింది. లేకపోతే పరిస్థితులు మరింతగా దిగజారి పెద్ద ఆర్థిక మాద్యానికి దారితీసేదని నిపుణులు అంటున్నారు. అదే జరిగితే మరో 2008 లాంటి పరిస్థితులు వచ్చేవేమో అని వారు అంటున్నారు. ఉద్యోగాల కల్పనతో అమెరికన్లు ఒళ్లు వంచి పనేచేసేలా ట్రంప్ చేశాడు. అయితే ట్రంప్ హయాం తర్వాత తిరిగి అక్రమ వలసదారులు పెరిగిపోవటంతో ఉద్యోగం చేద్దామన్నా అమెరికన్లకు దొరకటం లేదు. అందుకే చాలా చోట్ల బైడెన్ హయాంలో వీరిని డిపోర్ట్ చేయాలనే డిమాండ్లు పెరిగాయి. గత నెలలో సైతం అక్రమంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్లను ప్రత్యేక విమానంలో పంపిన సంగతి తెలిసిందే.

ట్రంప్ ఉంటే ఆయిల్ రేట్లు పెరగవ్..!
వాస్తవానికి 2016-2020 మధ్య ట్రంప్ పాలనను నిశితంగా పరిశీలిస్తే ఆయన ప్రపంచంలోని ఏ దేశంపై కూడా యుద్ధానికి వెళ్లలేదు. లేదా ఇతరుల యుద్ధాల్లో వేలు పెట్టలేదు. దీని కారణంగా క్రూడ్ ఆయిల్ ధరల్లో భారీ పెరుగుదల జరగలేదు. ప్రధానంగా ఆయన ఫోకస్ అమెరికా అభివృద్ధిపైనే కొనసాగింది. ట్రంప్ బాధ్యతలు చేపట్టాక రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో నుంచి అమెరికా పక్కకు తప్పుకునే అవకాశం ఉంది. గడచిన 30-40 ఏళ్ల అమెరికా చరిత్రను పరిశీలిస్తే ఇది నిజమేననే విషయం మనకు అర్థం అవుతుంది. బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా లాంటి అధ్యక్షులు.. లిబియా, ఇరాన్, ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలపై యుద్ధాలు చేసిన సంగతి తెలిసిందే. ఇది పరోక్షంగా ద్రవ్యోల్బణం అదుపులోనే ఉంచటానికి ట్రంప్ హయాంలో దోహదపడింది. ట్రంప్ ఎప్పుడు ఇతర దేశాల విషయాల్లో వేలు పెట్టలేదు. ఈసారి సైతం ట్రంప్ పాలన అమెరికాకు మేలు చేసేదిగానే ఉంటుందని తాజాగా ఆయన మాటల ప్రకారం తెలుస్తోంది. అమెరికాకు మళ్లీ స్వర్ణ యుగం తిరిగి వస్తుంది, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటూ నేటి విజయం తర్వాత ఆయన అన్న విషయం చూస్తే మళ్లీ గత పాలన కొనసాగే అవకాశం ఉందని తెలుస్తోంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+