షాపింగ్‌మాల్లో ముద్దు,అరెస్ట్: కోర్టుకెక్కిన యువతులు

హవాయి: తాము ఇద్దరం బహిరంగంగా ముద్దు పెట్టుకున్నందుకు అరెస్టు చేశారని ఇద్దరు లెస్బియన్స్ చెబుతున్నారు. ఈ సంఘటన హవాయిలో జరిగింది. బహిరంగంగా ఓ షాపింగ్ మాల్‌లో ముద్దు పెట్టుకున్నామని అరెస్ట్ చేశారని ఇద్దరు మహిళా లెస్బియన్స్ కోర్టుకెక్కారు.

తాము ఎంత చెబుతున్నా వినకుండా అక్కడే తమను విసిగించారన్నారు. వేధింపులకు గురి చేసి అవమానించారని ఆవేదన వ్యక్తం చేశారు. తమను అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తీసుకు వెళ్లారన్నారు.

లాస్ ఏంజిల్స్‌కు చెందిన కోర్ట్నీ విల్సన్, టేలర్ గ్వెరెరో హవాయి ద్వీపంలో సరదాగా గడిపేందుకు వచ్చారు. అక్కడే ఓ ఫుడ్ లాండ్ స్టోర్‌లో బహిరంగంగా ముద్దులు పెట్టుకున్నారు. ఈ సన్నివేశాన్ని అక్కడి పోలీసు అధికారి.. ఇక్కడ ఇలాంటివి చేయవద్దని కేకలు వేశారు.

వారు అక్కడ ఆగిపోయినప్పటికీ.. ఆ తర్వాత షాపింగ్ చేస్తూ మరోసారి ముద్దు పెట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు వారిని బలవంతంగా షాపింగ్ మాల్ నుంచి ఈడ్చి బయటకు తీసుకు వచ్చి, అరెస్టు చేశారు. దీంతో వారు కోర్టులో దావా వేశారు.

Lesbian Couple Claim They Were Arrested in Hawaii for Kissing

బీబర్ క్షమాపణ

అభిమానులపై ఆగ్రహాన్ని ప్రదర్శించి, అర్థాంతరంగా లైవ్ షో నుంచి వెళ్లిపోయిన పాప్ స్టార్ జస్టిన్ బీబర్... ఆ తర్వాత క్షమాపణలు చెప్పాడు. నార్వేయన్ టీవీ షోలో ప్రదర్శన ఇచ్చేందుకు బీబర్ సిద్ధమయ్యాడు. ముందు వరుసలో కూర్చున్న అభిమానులు స్టేజ్ పైన ఏదో ద్రవం పోశారు.

దానిని తుడిచేందుకు బీబర్ ప్రయత్నించగా... వారు అతనిని అడ్డుకున్నారు. బీబర్ సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా వారు వినిపించుకోలేదు. దీంతో అసహనం వ్యక్తం చేసిన బీబర్, షో నుంచి అర్థాంతరంగా వెళ్లిపోయాడు. ఆ తర్వాత తప్పిదాన్ని గ్రహించిన బీబర్ అభిమానులను క్షమాపణలు కోరాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+