రష్యాలో సర్కస్, హఠాత్తుగా చిన్నారిపై పంజా విసిరిన సింహం, గాయాలు
మాస్కో: సర్కస్‌లో విన్యాసాలు చేయాల్సిన ఓ సింహం నాలుగేళ్ల చిన్నారిపై దాడి చేసింది. పంజా విసిరి అమాంతం తినేందుకు ప్రయత్నించింది. కానీ ఆ బాలిక ప్రాణాలతో బయటపడింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ సంఘటన రష్యాలోని క్రాస్‌నోడర్‌లోని ఓ గ్రామంలో చోటు చేసుకుంది. సింహంతో సర్కస్ నిర్వహించారు. సింహం బోనులోకి వెళ్లిన ట్రెయినర్ దానితో ఫీట్లు చేయిస్తున్నాడు. షోకి వచ్చిన ఓ నాలుగేళ్ల చిన్నారి కూడా ఆ సింహం విన్యాసాలను చూస్తూ ఆనందిస్తోంది.

ఇంతలోనే ట్రెయినర్ దాంతో మరో విన్యాసం చేయించేందుకు పక్కకు తీసుకు వచ్చాడు. సింహం అలా నేలపై ఒరిగింది. ట్రయినర్ ప్రేక్షకుల వైపు చూస్తూ ఏదో చెప్పబోయాడు. అంతలోనే సింహం బోను దగ్గరలో ఉన్న ఓ చిన్నారిపై పంజా విసిరింది. బోను లోపలకు లాక్కొచ్చి తినేందుకు ప్రయత్నించింది. కానీ సిబ్బంది రక్షించారు.
సింహం పంజా విసరడంతో చిన్నారి ముఖంపై తీవ్ర గాయమైందని, వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఎలాంటి రక్షణ ఏర్పాట్లు లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చెబుతున్నారు. ఇందుకు బాధ్యులుగా చెబుతూ సర్కస్ డైరెక్టర్‌ను విధుల నుంచి తొలగించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications