Saudi Arabia: సౌదీ అరేబియా సంచలన నిర్ణయం.. ఇక మందుబాబులకు పండుగే..!

సౌదీ అరేబియా సంచలన నిర్ణయం తీసుకునే దిశగా కొనసాగుతోంది. ఆ దేశ రాజధాని రియాద్‌లో తన మొదటి ఆల్కహాల్ షాపు తెరవడానికి సిద్ధమవుతోంది. మద్యం కోసం
కస్టమర్లు మొబైల్ యాప్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. అలాగే విదేశాంగ మంత్రిత్వ శాఖ నుంచి క్లియరెన్స్ కోడ్‌ను పొందాలి. నెలవారీ కోటాలను ఉంటాయని రాయిటర్స్ పేర్కొంది. అయితే ఈ మద్యం కొందరికి మాత్రమే అందుబాటులో ఉండనుంది. ఇస్లాంలో మద్యం సేవించడం నిషేధం. అయితే పర్యాటకం, వ్యాపారం కోసం వచ్చే వారి కోసం మద్యం షాపులు ఓపెన్ చేయడానికి సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ సల్మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

మద్యం రాయబార కార్యాలయాలు, దౌత్యవేత్తలు నివసించే వారికే మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర ముస్లిమేతర ప్రవాసులకు షాపుకు వెళ్లి తీసుకోవచ్చా లేదా అనేది తెలియాల్సి ఉంది. సౌదీ అరేబియాలో మిలియన్ల మంది ప్రవాసులు నివసిస్తున్నారు. అయితే వారిలో ఎక్కువ మంది ఆసియా, ఈజిప్టు నుంచి వచ్చిన ముస్లిం కార్మికులు ఉంటారు. ముఖ్యంగా తెలంగాణ నుంచి భారీగా హిందు, ముస్లింలు కూడా సౌదీ వెళ్తుంటారు. మరి వీరికి మద్యం అమ్ముతారా లేదా అనేది కూడా అస్పష్టంగానే.

Liquor is likely to be opened in Riyadh, the capital of Saudi Arabia

సౌదీ అరేబియాలో మద్యం తాగడానికి వ్యతిరేకంగా కఠినమైన చట్టాలు ఉన్నాయి. మద్యం తాగినా, అమ్మినా వందల కొరడా దెబ్బలు, బహిష్కరణ, జరిమానాలు లేదా జైలు శిక్ష విధిస్తారు. తాజాగా కొరడా దెబ్బలు ఎక్కువగా జైలు శిక్షలు భర్తీ చేస్తారు. "ఈ కొత్త ప్రక్రియ ముస్లిమేతర రాయబార కార్యాలయాల దౌత్యవేత్తలందరికీ నిర్దిష్ట కోటాలో ఈ ఉత్పత్తులకు కలిగి ఉండేలా మంజూరు చేయడం " అని సీఐసీ రాయిటర్స్‌కి ఒక ప్రకటనలో తెలిపింది.

ప్రిన్స్ మొహమ్మద్ అధికారం చేపట్టిన తర్వాత పలు మార్పులు చేశారు. మత రహిత పర్యాటకం, సంగీత కచేరీలు, మహిళల డ్రైవింగ్‌కు అనుమతించారు. విజన్ 2030లో స్థానిక పరిశ్రమలు, లాజిస్టిక్స్ హబ్‌లను అభివృద్ధి చేయడం కూడా ఆయన టార్గెట్ గా పెట్టుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+