Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

83 ఏళ్ల బామ్మతో 23 ఏళ్ల యువకుడి లవ్ స్టోరీ.. ఫుల్ వైరల్ !

ప్రేమ అనేది మానవ జీవితంలో అత్యంత విలువైన భావోద్వేగం. హృదయాన్ని తాకే ఆ అందమైన అనుభూతిని మాటల్లో చెప్పడం అంటే కష్టమే. రెండు మనసులను కలిపే ఒక మధురమైన బంధం. అటువంటి ప్రేమకు భాష లేదు, సరిహద్దు లేదు.. వయస్సు అనే తేడా ఉండదు. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రేమ అనేది ఒక ప్రయాణం, ఆ ప్రయాణంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ప్రేమతోనే మనం ముందుకు వెళ్తాం. ముఖ్యంగా వయస్సు తేడా కూడా నిజమైన ప్రేమను ఆపలేదనే అనేక ఉదాహరణలు ప్రపంచంలో ఉన్నాయి.

ప్రేమ వయస్సును కాదు, వ్యక్తి మనసును చూసి పుడుతుంది. మనసులు కలిసినప్పుడు వయస్సు వ్యత్యాసం ఒక సంఖ్యగా మారిపోతుంది. ఈ నిజాన్ని మరోసారి నిరూపించేలా జపాన్‌లో చోటుచేసుకున్న ఒక వినూత్నమైన ప్రేమకథ ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

love-story-of-an-83-year-old-women-with-a-23-year-old-man-goes-viral

23 ఏళ్ల యువకుడితో 83 ఏళ్ల బామ్మ లవ్ స్టోరీ..

జపాన్‌లో 23 ఏళ్ల యువకుడు కోఫు, 83 ఏళ్ల బామ్మ ఐకోతో ప్రేమలో పడిన విషయం నెట్టింట్లో ఫుల్ వైరల్ అవుతోంది. ఈ జంట ఆరు నెలలుగా రిలేషన్‌లో ఉంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తమ ప్రేమను బహిరంగంగా ప్రకటించారు. ఐకో ఇప్పటికే రెండుసార్లు పెళ్లి చేసుకోగా.. ఇద్దరు పిల్లలు, ఐదుగురు మనవరాళ్లు ఉన్నారు. కోఫు ప్రస్తుతం తన గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి ఇంటర్న్‌గా జాబ్ ఉన్నాడు.

సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం.. కోఫు తన క్లాస్‌మేట్ ఇంటికి వెళ్లినప్పుడు ఐకోను తొలిసారి కలిశాడు. ఐకో ఆ క్లాస్‌మేట్ అమ్మమ్మ. మొదటి చూపులోనే ఇద్దరూ ఒకరిపై ఒకరు ఆకర్షితులైనా, 60 ఏళ్ల వయస్సు తేడా కారణంగా తమ భావాలను వ్యక్తపరచలేదు. ఒక రోజు ఐకో మనవరాలు డిస్నీల్యాండ్ ట్రిప్ ప్లాన్ రద్దు చేసుకోవడంతో.. కోఫు - ఐకోలు అక్కడికి వెళ్లారు. సిండ్రెల్లా కోట ముందు కోఫు తన ప్రేమను వ్యక్తం చేస్తూ ఐకోకు ప్రపోజ్ చేశాడు. ఈ ఘటన వారిద్దరి జీవితంలో కీలక మలుపుగా నిలిచింది.

love-story-of-an-83-year-old-women-with-a-23-year-old-man-goes-viral

ఈ జంట ఇంటర్వ్యూలో తమ ప్రేమ, బంధం గురించి మాట్లాడుతూ అనేక విషయాలు పంచుకున్నారు. కోఫు.. ఐకో ముఖం చూడగానే నా రోజు పూర్తవుతుంది" అని చెబుతుండగా, ఐకో - "కోఫు కోసం వంట చేయడాన్ని నేను ఇష్టపడతాను" అని తెలిపింది. అయితే కోఫు కుటుంబ సభ్యులు వారి ప్రేమకు ఎలాంటి అభ్యంతరం చెప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ వింత ప్రేమకథపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+