పవర్ గేమ్- నోబెల్ శాంతి బహుమతి దక్కించుకున్న ట్రంప్?
అమెరికాలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి. వెనిజులాపై సైనిక చర్య, ఆ దేశాధ్యక్షుడు నికొలస్ మదురోను నిర్బంధించడం, కొత్త అధ్యక్షురాలి నియామకం అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. వెనిజులా ప్రతిపక్ష నాయకురాలు, నోబెల్ శాంతి బహుమతి అవార్డు గ్రహీత మరియా కొరినా మచాడోతో సమావేశం కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వైట్ హౌస్ లో ఈ భేటీ ఏర్పాటైంది. సుమారు గంట పాటు కొనసాగింది.
వెనిజులాపై సైనిక చర్య అనంతరం వారిద్దరు భేటీ కావడం ఇదే మొదటిసారి. పైగా స్వయానా పదవీచ్యుతుడైన ఆ దేశాధ్యక్షుడు, ప్రథమ మహిళ ఆమెరికాలో సైనికుల నిర్బంధంలో ఉన్న సమయంలో ఆమె స్వయంగా వైట్ హౌస్ కు రావడం, ట్రంప్ ను కలుసుకోవడం చర్చనీయాంశమైంది. వెనిజులాను విడిచిపెట్టిన సుదీర్ఘ కాలం తర్వాత.. వాషింగ్టన్‌లో మచాడో బహిరంగంగా కనిపించడం కూడా ఇదే తొలిసారి.

ట్రంప్‌తో భేటీ అనంతరం వైట్‌హౌస్ నుంచి బయలుదేరిన మచాడో.. విలేకరులతో మాట్లాడారు. వెనిజులా స్వాతంత్ర్యం కోసం డొనాల్డ్ ట్రంప్‌పై ఆధారపడుతున్నామని పేర్కొన్నారు. తన నోబెల్ శాంతి బహుమతి పతకాన్ని ఆయనకు అందించినట్లు వెల్లడించారు. ట్రంప్ నిబద్ధతకు గుర్తింపుగా, తన నోబెల్ శాంతి పురస్కారాన్ని త్యాగం చేసినట్లు స్పష్టం చేశారు. వెనిజులాలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ గురించి ట్రంప్ తో చర్చించినట్లు తెలిపారు.
నోబెల్ శాంతి బహుమతిని మచాడో.. ట్రంప్ కు అందజేసిన విషయాన్ని వైట్ హౌస్ నిర్ధారించింది. ప్రస్తుతం ఈ పతకం ట్రంప్ స్వాధీనంలో ఉందని తెలిపింది. అటు ట్రంప్ కూడా ఈ భేటీకి సంబంధించిన వివరాలను క్లుప్తంగా వెల్లడించారు. కొరినా మచాడోను కలుసుకోవడం తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని అన్నారు. ఎన్నో కష్టాలను అనుభవించిన అద్భుతమైన మహిళగా ప్రశంసించారు. తన ట్రూత్ సోషల్ లో పోస్ట్ లో ఈ విషయాన్ని షేర్ చేశారు.
కాగా- నోబెల్ కమిటీ నిబంధనల ప్రకారం.. శాంతి బహుమతిని ఇతరులకు బదిలీ చేయడానికి లేదా వారితో పంచుకోవడానికి అవకాశం లేదు. నార్వేజియన్ నోబెల్ ఇన్‌స్టిట్యూట్ ఈ విషయాన్ని పునరుద్ఘాటించింది. అంతకుముందు మచాడో నాయకత్వంపై ట్రంప్ అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. దేశాన్ని నడిపించడానికి మచాడోకు తగిన విశ్వసనీయత లేదని కొట్టిపారేశారు. ఆమె నాయకత్వాన్ని అక్కడి ప్రజలు నమ్మట్లేదని అన్నారు.
-
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం! -
సాక్షాత్ FBI చీఫ్ కే దిక్కులేదు- ఇరాన్ హ్యాకర్ల పంజా -
ట్రంప్ ఫోన్లు ఎత్తని ఇరాన్ ? ముందుకెళ్లని చర్చలకు 3 కారణాలు..! -
"ఇరాన్ తో యుద్ధం త్వరలోనే ముగిస్తాం" -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !!











Click it and Unblock the Notifications