"నోబెల్ శాంతి అవార్డు ట్రంప్‌ కు అంకితం".. మరియా కొరినా సంచలన ప్రకటన

ప్రతిష్ఠాత్మక నోబెల్‌ శాంతి బహుమతి కోసం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కళ్లు కాయలు కాసేలా ఎదురుచూశారు. తాను ప్రపంచంలో 8 యుద్ధాలను ఆపేశానని నోబెల్ శాంతి బహుమతి తనకే రావాలని పలు అంతర్జాతీయ వేడుకలపై చెప్పుకుంటూ వచ్చారు. అటు పాకిస్థాన్, జపాన్, ఇజ్రాయెల్ లాంటి దేశాలు సైతం నోబెల్ శాంతి బహుమతికి ట్రంప్ ను నామినేట్ చేశాయి. కానీ ట్రంప్ కు చివరికి నిరాశే మిగిలింది. ప్రతిష్టాత్మక నోబెల్ శాంతి పురస్కారం.. వెనిజులాకు చెందిన మరియా కొరినాకు దక్కింది. దీంతో ట్రంప్ ఆశలన్నీ అడియాసలు అయ్యాయి.

వెనిజులాలో ప్రజలకు మద్దతుగా ప్రజాస్వామ్య హక్కుల కోసం ప్రజల తరఫున పోరాటం చేసినందుకు గాను ఆమెను గుర్తించి ఈ అవార్డ్‌ కు ఎంపిక చేశారు. వెనిజులా దేశం నియంతృత్వ పాలన నుంచి డెమోక్రటిక్ దేశంగా మారేందుకు ఆమె శాంతియుతంగా చేసిన పోరాటాలను గుర్తించి ఈ అవార్డును అందజేశారు. అయితే తాజాగా తనకు నోబెల్ శాంతి బహుమతి రావడంపై వెనిజులా ఉద్యమకారిణి మరియా కొరినా స్పందించారు. ఈ అవార్డును బాధల్లో ఉన్న వెనిజులా ప్రజలకు.. అలాగే వెనిజులా ప్రజలకు మద్దతిచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు అంకితం చేస్తున్నట్లు తెలిపారు.

Machado s Nobel Tribute Venezuelan Leader Dedicates Peace Prize to Trump for Democracy Support

ట్రంప్ తో నిర్విరామంగా పోరాటాలు చేస్తున్న దేశ ప్రజలకు, తమకు అండగా నిలిచిన ప్రపంచ దేశాలకు ఈ అవార్డును అంకితం చేస్తున్నట్లు ఉద్యమకారిణి మరియా కొరినా తెలిపారు. ఈ అవార్డు తనలో కొత్త ఉత్తేజాన్ని నింపిందని వివరించారు. అయితే నోబెల్ శాంతి బహుమతి తనకు దక్కకపోవడంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌజ్ స్పందించింది. అవార్డను ఇవ్వడంలో వివక్ష చూపించారని తెలిపింది. శాంతి కంటే రాజకీయాలే ముఖ్యమని తేలిందని పేర్కొంది. అయినా ట్రంప్.. ప్రపంచ దేశాల శాంతికి యత్నిస్తూనే ఉంటారని స్పష్టం చేసింది. ఇక ఇదే విషయంపై ట్రంప్ అంతకుముందు మాట్లాడుతూ.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి అందించారని పేర్కొన్నారు. ఆయనకు అవార్డు ఎందుకు దక్కిందో ఆయనకే తెలియదని స్పష్టం చేశారు ట్రంప్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+