జపాన్ లో భారీ భూకంపం.. బాబా వంగా చెప్పినట్టే.. మరికొన్ని గంటల్లో సునామీ..!
జపాన్ లోని టోకారా దీవుల్లో భారీ భూకంపం సంభవించింది. జులై 5(శనివారం) న 5.3 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. భూకంపం ధాటికి సౌత్ వెస్టర్న్ జపాన్ లో ప్రకంపనలు సంభవించాయి. జపాన్ లోని టోకారో దీవులు గత కొద్ది రోజులుగా భూకంపాలను నిలయంగా మారాయి. ఈ ప్రాంతాల్లో తరచూ భూకంపాలు వస్తుంటాయి. తాజాగా మరోసారి జులై 5 ఉదయం ఈ దీవుల్లో భూకంపం సంభవించింది.
బాబా వంగా పేరుతో ఫేమస్ అయిన రియో టాట్సుకి అంచనా జపాన్ వాసులను భయబ్రాంతులకుగురిచేస్తోంది. బాబా వెంగా రాసిన 'ది ఫ్యూచర్ ఐ సా' పుస్తకంలో జపాన్ దేశంలో జూలై నెలలో భారీ విపత్తు సంభవిస్తుందని.. భూకంపాలు, వరదలు విజృంభిస్తాయని పేర్కొంది. ఈ విధ్వంసం కారణంగా చాలా పెద్ద మార్పులు సంభవిస్తాయని పుస్తకంలో ఉంది. దీంతో జపాన్ ప్రజలు జులై 5 అంటేనే భయంతో వణికిపోతున్నారు. ఈ క్రమంలో ఇదే రోజు జపాన్ లో భూకంపం సంభవించడం సర్వత్రా ఆందోళనకరంగా మారింది.

జపాన్ లోని టోకారా దీవుల్లో తాజాగా భారీ భూకంపం సంభవించింది. జులై 5, శనివారం రోజున 5.3 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. భూకంపం ధాటికి సౌత్ వెస్టర్న్ జపాన్ లో ప్రకంపనలు సంభవించాయి. ఈ విషయాన్ని జపాన్ మెటిరియోలాజికల్ ఏజెన్సీ ధ్రువీకరించింది. టొకారో దీవుల్లో ఉదయం 6 గంటల 29 నిమిషాల సమయంలో భూకంపం సంభవించినట్లు తెలిపింది. భూకంపం 20 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతం అయినట్లు అధికారులు వెల్లడించారు. అయితే సునామీ అంచనాలు ఏమీ లేవని తెలిపారు.
[Intensity Map] JMA Reports: A magnitude 5.3 #earthquake #地震 with a max intensity of 5+ and a depth of 20km has occured トカラ列島近海 (The sea near the Tokara archipelago) at 07/05 06:29 JST. #japan pic.twitter.com/AeUxjwkDfe
— Rapid Earthquake Alerts - Japan (@RapidQuakeAlert) July 4, 2025
అయితే బాబా వెంగా చెప్పిన జోస్యం ప్రకారమే 2011లో ఓసారి జపాన్ ను సునామీ ముంచెత్తింది. ఈ ప్రళయంలో భారీ ఆస్తి నష్టంతో పాటు 20 వేల మందికి పైగా ప్రజలు మరణించారు. ఇది జపాన్ చరిత్రలోనే భారీ సునామీగా పేరొందింది. ఈ క్రమంలో తాజాగా జపాన్ ప్రజలు భయబ్రాంతులకు లోనవుతున్నారు. ఇక జూన్ 21 నుంచి ఇప్పటివరకు టొకారో దీవుల్లో 1000 కు పైగా భూకంపాలు సంభవించాయి. జులై 3 న కూడా 5.5 తీవ్రతతో ఈ ప్రాంతంలో భూకంపం సంభవించింది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications