రంగులు మారిన ఆకాశం: బిత్తరపోతోన్న జనం
Solar Storm 2024: వేకువ జామున ఆకాశం ఎలా ఉంటుంది? ప్లెజెంట్‌గా కనిపిస్తుంది. సరికొత్త అందాలతో కనువిందు చేస్తుంది. అప్పుడప్పుడే ప్రసరిస్తోన్న భానుడి కిరణాలు వెచ్చగా స్పృశిస్తుంటాయి. సాధారణంగా ఎక్కడైనా ఇలాంటి మనోహర దృశ్యాలే కనిపిస్తుంటాయి.
టాస్మానియా, బ్రిటన్, యూరప్ సహా ఉత్తర ధృవానికి సమీపంలో ఉండే కొన్ని దేశాల్లో మాత్రం దీనికి భిన్నమైన వాతావరణం నెలకొంది. జనాలను బిత్తరపోయేలా చేసింది. ఆకాశం పూర్తిగా రంగు మారింది. ఇంద్రధనస్సును తలపించింది. ఆకుపచ్చ, గులాబీ, లేత నీలం.. ఇలా ఎన్నో రంగులను పులముకుని కనిపించింది.

okay i’m speechless and overjoyed! spent ages in the garden staring up at the aurora. on a warm summer night too. what a time to be alive.
— emmalition🗡️ (@emmalition) May 10, 2024
i only said “it’s like Skyrim” once pic.twitter.com/nUgyYX2TU5
దీనికి కారణం లేకపోలేదు. సౌర తుఫాన్. 20 సంవత్సరాల తరువాత సంభవించిన అతిపెద్ద సౌర తుఫాన్ వల్ల ఆకాశం రంగులు మార్చుకుంది. సౌర తుఫాన్ ప్రభావంతో ఉత్తర ధృవంలో నార్తరన్ లైట్స్ ఏర్పడ్డాయి. ఐర్లాండ్, చెక్ రిపబ్లిక్, జర్మనీ వంటి దేశాల్లో సౌర తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది.
బ్రిటన్ విట్లే బే, ఈశాన్య తీర ప్రాంతంలోని ఎస్సెక్స్, కేంబ్రిడ్జిషైర్, వోకింగ్‌హామ్, బెర్క్‌షైర్, సఫోల్క్, కెంట్, హ్యాంప్‌షైర్, లివర్‌పూల్.. వంటి ప్రాంతాల్లో ఆకాశం వింత రంగులతో మెరిసిపోయింది. స్థానికులు వాటిని ఫొటోలు తీసి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌పై పోస్ట్ చేశారు.
Just had an intense burst over Chester SC. It looked like green flames by the naked eye! @SCweather_wx @wxbrad @HenryWX @NWSGSP pic.twitter.com/VoQXOI72bw
— Antonio Adkins (@AntonioAdkins17) May 11, 2024
ఇదే విషయాన్ని టెస్లా చీఫ్, ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ అధినేత ఎలాన్ మస్క్ సైతం ట్వీట్ చేశారు. ఎన్నో సంవత్సరాల తరువాత అతి పెద్ద సౌర తుఫాన్ సంభవించిందని వివరించారు. దీని తీవ్రతను లెక్కకట్టారు. దీని ప్రభావం మాత్రం అనూహ్యంగా ఉంటోందని, అంచనాలకు అందట్లేదని చెప్పారు.
Major geomagnetic solar storm happening right now. Biggest in a long time. Starlink satellites are under a lot of pressure, but holding up so far. pic.twitter.com/TrEv5Acli2
— Elon Musk (@elonmusk) May 11, 2024
గురువారం అర్ధరాత్రి ఆరంభమైన ఈ సౌర తుఫాన్ ఇప్పటికీ కొనసాగుతోందని, ప్రతి గంటకూ తీవ్ర రూపాన్ని దాల్చుతోందని ఎలాన్ మస్క్ తెలిపారు. ఈ సౌర తుఫాన్‌ను అతి తీవ్రమైనదిగా అభివర్ణించారాయన. దీని ప్రభావం స్టార్ లింక్ శాటిలైట్లపైనా పడిందని, అయినప్పటికీ- దీన్ని అవి తట్టుకుంటోన్నాయని చెప్పారు.
ఈ సౌర తుఫాన్ మరికొన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండొచ్చని నేషనల్ ఓషనిక్ అండ్ అట్మాస్ఫియర్ అడ్మినిస్ట్రేషన్ అంచనా వేసింది. దీని తీవ్రత మరింత పెరగొచ్చని పేర్కొంది. సౌర తుఫాన్ వల్ల నార్తరన్ లైట్స్ అసాధారణ స్థితిల సంభవించినట్లు వెల్లడించింది.
-
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
మహేశ్‌కు శ్రీలీల స్వీట్ వార్నింగ్! -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
ఉగాది ఎప్పుడు చేసుకోవాలి 19 లేక 20 తేదీనా - వరుస సెలవులపై తాజా నిర్ణయం..!! -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో అల్లు అర్జున్ కుమార్తె..! -
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్












Click it and Unblock the Notifications