పార్లమెంటా? కుస్తీలు పడే రింగా?: కొట్టుకున్న ఎంపీలు (వీడియో)

Maldives: మాల్దీవులు మరోసారి వార్తల్లో నిలిచింది. ఇటీవల భారత్, ప్రధాని మోడీపై వివావాస్పద వ్యాఖ్యలు చేసి మాల్దీవులు.. తగిన మూల్యం చెల్లించుకున్న విషయం తెలిసిందే. ఇక, ఈసారి మాత్రం తమ పరువును పోగొట్టుకునేలా ప్రవర్తించింది. ఏకంగా పార్లమెంటులోనే మాల్దీవుల చట్టసభ్యులు కుస్తీపోటీని తలపించేలా చేశారు.

ఎంపీల తోపులాటలు, ముష్టిఘాతలతో ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డారు. దీంతో మాల్దీవుల పార్లమెంటు అట్టుడికింది. మహమ్మద్ ముయిజ్జు నేతృత్వంలోని ప్రభుత్వం తీసుకున్న ఓ తీర్మానంపై ఓటింగ్ సమయంలో సభలో తీవ్ర ఉద్రిక్త నెలకొంది. చట్టసభ్యులు కొట్టుకుంటున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.

Maldives: Lawmakers Punches, Kicks each other, Hair Pulled During Parliament Session

మాల్దీవులు కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై పార్లమెంటులో ఆదివారం ఓటింగ్ నిర్వహించారు. ఈ క్రమంలోనే అధికార, విపక్ష ఎంపీలు సభలో గందరగోళం సృష్టించారు. పోడియంపైకి వెళ్లిన కొందరు సభ్యులు స్పీకర్ కార్యకలాపాలకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో మరికొందరు సభ్యులు అక్కడికి చేరుకుని స్పీకర్ తోపాటు అక్కడున్న సభ్యులతో వాగ్వాదానికి దిగారు.

బెంచీలపైనుంచి దూసుకెళ్లారు. స్పీకర్‌ను తోసేసే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత ఎంపీలు ఒకరిపై ఒకరు ముష్టిఘాతాలు కురిపించుకున్నారు. ఈ క్రమంలోనే ఇద్దరు ఎంపీలు కిందపడి దొర్లుతున్నట్లు వీడియోలో కనిపించింది. ఇందులో ఒక ఎంపీ కాలుతో తన్నుతుండటం కనిపించింది. సభ్యుల మధ్య వాగ్వాదం, ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. కాగా, కొందరు సభ్యులకు గాయాలైనట్లు తెలుస్తోంది. వీడియోలు వైరల్ కావడంతో నెటిజన్లు మాల్దీవుల వ్యవహారంపై తమదైన శైలిలో సెటైరికల్ గా స్పందిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+